అమెరికా టీ20 లీగ్ MLC 2024లో ధోని శిష్యుడు చెలరేగిపోయాడు. బిల్డప్ బాబాయ్ అనుకుంటే.. బుల్డోజర్‌లా మారాడు. లైన్ అండ్ లెంగ్త్ బౌలర్లను కూడా ఊచకోత కోశాడు. అతడు మరెవరో కాదు.. మేజర్ లీగ్ క్రికెట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఫాఫ్ డుప్లెసిస్. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై న్యూయార్క్‌పై 47 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అతడి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టెక్సాస్ సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో గెలిచి ఛాలెంజర్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.
డుప్లెసిస్ ఆధిపత్యం..
40 ఏళ్ల డుప్లెసిస్ ఈ కీలక మ్యాచ్‌లో పరుగుల వరద పారించాడు. ఇప్పటిదాకా 7 మ్యాచ్‌లు ఆడి 375 పరుగులు చేశాడు. డుప్లెసిస్ బ్యాటింగ్ సగటు 53.57 కాగా.. స్ట్రైక్ రేట్ 170కిపైగా ఉంది. ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు, ఫోర్లు కొట్టిన ఆటగాడు కూడా డుప్లెసిస్. డుప్లెసిస్ బ్యాట్‌లో ఇప్పటివరకు 22 సిక్సర్లు, 36 ఫోర్లు వచ్చాయి.
డుప్లెసిస్‌కు అవకాశం రాలేదు..
ఓ వైపు మేజర్ లీగ్ క్రికెట్‌లో డుప్లెసిస్ అద్భుతాలు చేస్తే.. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులో అతనికి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. డుప్లెసిస్ 2021లో టెస్ట్ క్రికెట్‌కు రిటైరయ్యాడు. T20, ODI ఫార్మాట్‌లలో ఆడాలని ఆసక్తి చూపించినా.. అతడ్ని దక్షిణాఫ్రికా సెలక్టర్లు ఏ ఫార్మాట్‌లోనూ అవకాశం ఇవ్వలేదు. డుప్లెసిస్ 2022, 2024 టీ20 ప్రపంచకప్.. అలాగే 2023 వన్డే ప్రపంచకప్‌లో కూడా సఫారీల జట్టుకు ఆడే అవకాశం రాలేదు డుప్లెసిస్.