టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర.. శ్రీలంక రికార్డ్ బ్రేక్!

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర.. శ్రీలంక రికార్డ్ బ్రేక్!

ఒమన్‌పై విజయం
ఇంగ్లండ్ చరిత్ర
శ్రీలంక రికార్డ్ బ్రేక్

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్-బీలో భాగంగా ఆంటిగ్వా వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఇంగ్లండ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఒమన్‌ నిర్ధేశించిన 48 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్స్ కోల్పోయి 3.1 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో 101 బంతులు మిగిలుండగానే ఇంగ్లీష్ జట్టు లక్ష్యాన్ని సాధించింది.

అంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 2014 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై లంక 90 బంతులు మిగిలుండగానే.. లక్ష్యాన్ని సాధించింది. పదేళ్ల తర్వాత లంక రికార్డును ఇంగ్లండ్ బద్దలు కొట్టింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మూడు, నాలుగు స్థానాల్లో ఆస్ట్రేలియా (86 బంతులు, నమీబియాపై 2024), ఆస్ట్రేలియా (82 బంతులు, బంగ్లాదేశ్‌పై 2021) ఉంది. భారత్ (81 బంతులు, స్కాట్లాండ్‌పై-2021), శ్రీలంక (77 బంతులు, నెదర్లాండ్స్‌‌పై 2021) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Please follow and like us:
క్రీడలు వార్తలు