బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..

పటాన్ చెరువు ఎమ్మెల్యే ఆయన సోదరుల ఇళ్లపై ఈడీ దాడులు..

పటాన్‌ చెరువు ఎమ్మెల్యే ఆయన సోదరుడు కాంట్రాక్టర్లలో సోదాలు..

ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన రెడ్డి ఇళ్లలో తనిఖీలు..

ఎమ్మెల్యే తో పాటు సోదరుడికి పెద్ద ఎత్తున మైనింగ్ బిజినెస్..

ఈడీ సోదాల వ్యవహారం తెలంగాణలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అదే సమయంలో ఆయన సోదరుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల ఓ కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లోనే కాకుండా.. నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు 8 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేకు సంబంధించిన సంతోష్ గ్రానైట్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు.

లగ్గారం గ్రామ సమీపంలో ఉన్న కార్యాలయంలో కూడా సోదాలు చేపట్టారు. అక్రమ మైనింగ్ పైన ఇప్పటికే మధుసూదన్ రెడ్డి తోపాటు మైపాల్ రెడ్డి పై కేసు నమోదైన విషయం తెలిసిందే.. గతంలోని సంగారెడ్డి కలెక్టర్ అక్రమ మైనింగ్ లపై విచారణ కొనసాగుతుంది. ఆర్డిఓ నేతృత్వంలో జరిగిన విచారణలో అక్రమ మైనింగ్ గుర్తించారు. లగ్డారంలో నమోదైన కేసు ఆధారంగా సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు వెల్లడించారు. పెద్ద ఎత్తున బినామీల పేర్లతోటి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. బినామీ పేర్లతోటి మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు గుర్తింపు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో బినామీ పేర్లతోటి పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు