దసరా పండుగ వచ్చేసింది.. విద్యార్ధులకు ఎంజాయ్మెంట్ తెచ్చేసింది. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు వచ్చేశాయ్. అనుకున్నట్టుగానే ఈసారి విద్యార్ధులకు భారీగా సెలవులు ఇస్తూ.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తియ్యని కబురు అందించాయి.
ఏపీలో సెలవులు ఇలా..
అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు ప్రకటించింది కూటమి సర్కార్. వాస్తవానికి అక్టోబర్ 4 నుంచి సెలవులు ఇవ్వాల్సి ఉండగా.. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మంత్రి నారా లోకేష్ అక్టోబర్ 3 నుంచి 13 వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఇక అక్టోబర్ 2 గాంధీ జయంతి ఎలాగో పబ్లిక్ హాలిడే కాబట్టి.. దాదాపుగా విద్యార్ధులకు 12 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 14 నుంచి స్కూళ్లు తిరిగి పున:ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలో సెలవులు అలా..
బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఈసారి భారీగా సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు విద్యార్ధులకు దసరా సెలవులు లభించనున్నాయి. తిరిగి అక్టోబర్ 15న స్కూల్స్ రీ-ఓపెన్ కానున్నాయి. అక్టోబర్ 1వ తేదీన పాఠశాలల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు కాబట్టి.. ఎలాగో స్కూల్స్, కాలేజీలకు అధికారిక సెలవు.