రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల హడావుడి కనబడుతుంది. ఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఇంకా పురాతన భవనాలలోనే విద్యా బోధన కొనసాగుతుంది. పట్టణం, పల్లే అనే తేడా లేకుండా సమస్యలు వెంటాడుతున్నాయి. భారీ వర్షం కురిస్తే పాఠశాలలకు సెలవులు ఇచ్చే పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు కనిస సౌకర్యాలు కరువు అయ్యాయి. తమసమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం పాఠశాల్లో సమస్యలు తిష్టవేశాయి.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల హడావుడి కనబడుతుంది. ఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఇంకా పురాతన భవనాలలోనే విద్యా బోధన కొనసాగుతుంది. పట్టణం, పల్లే అనే తేడా లేకుండా సమస్యలు వెంటాడుతున్నాయి. భారీ వర్షం కురిస్తే పాఠశాలలకు సెలవులు ఇచ్చే పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు కనిస సౌకర్యాలు కరువు అయ్యాయి. తమసమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం పాఠశాల్లో సమస్యలు తిష్టవేశాయి. ముఖ్యంగా రేపోమాపో కూలిపోయేందుకు సిద్దంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల్లో విద్యా భోధన చేస్తున్నారు అధ్యాపకులు. వర్షాకాలం వస్తే చాలు పాఠశాలకి వెళ్ళాలంటేనే విద్యార్థులు భయపడుతున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పలు పాఠశాల్లో పెచ్చులు ఊడిపోతున్నాయి. అంతేకాకుండా వర్షం నీరు కుడా తరగతి గదులలోకి వెళ్తున్నాయి. గతంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాఠశాలల భవనాల తీరుపైనా అధికారులకి ఫిర్యాదు చేసారు. కానీ పట్టించుకునే నాథుడే కరువు అయ్యారు. నగరంలోని అర్ట్స్ పాఠశాలకి ఎంతో చరిత్ర ఉంది. కానీ ఈ పాఠశాల్లో విద్యార్థులు అడుగు పెట్టాలంటే వర్షాకాలంలో భయపడుతున్నారు.
గత సంవత్సరం సీలింగ్‌కు ఉన్న పెచ్చులు ఊడి కిందపడ్డాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదే విధంగా నగరంలోని మరో ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎటు చూసిన తుమ్మ చెట్లు కనబడుతున్నాయి. వర్షపు నీరు కుడా పాఠశాల ప్రాంగణంలో నిలుస్తుంది. అపరిశుభ్రమైనా వాతావరణంలో మూత్రశాలలు ఉన్నాయి. దీంతో మూత్రశాలలకి వెళ్ళాలంటనే విద్యార్థులు భయపడుతున్నారు. ముఖ్యంగా వర్షకాలం సీజన్లో దుర్వాసన కారణంగా అనారోగ్యానికి గురి అవుతున్నారు పిల్లలు. గ్రామీణ ప్రాంతాలలో అయితే శిథిలావస్థలో ఉన్న భవనాల్లోనే విద్యాబోధన సాగుతుంది. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహారీ గోడలు లేవు. దీంతో అల్లరిమూకలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిసంవత్సరం ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళినా నామమాత్రపు చర్యలు తీసుకొని చేతులు దులుపుకుంటున్నారు. నూతన భవనాలు నిర్మించాలని విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వర్తిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. భవానాలు సరిగా లేకపోవడం కనీస వసతులు లేని కారణంగా విద్యార్థులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పక్కా భవనాలు నిర్మించాలని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. పాఠశాలల్లో కనీస వసతులు లేవని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలం వస్తే భయంభయంగా పాఠశాలలకు వెళ్తున్బామని చెబుతున్నారు. పాఠశాల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.