ఆ పుణ్య క్షేత్రానికి వెళ్లాలంటే నరకమే.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు..

ఆ పుణ్య క్షేత్రానికి వెళ్లాలంటే నరకమే.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు..

ఇసుక లారీ డ్రైవర్ల బరితెగింపుతో అక్కడ సామాన్యులు నరకం అనుభవిస్తున్నారు. దీంతో ఆ జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‎గా మారింది. కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లే దారి లేదు. ప్రశ్నిస్తే ఆ లారీ డ్రైవర్లు సామాన్యులపైన ప్రతాపం చూస్తున్నారు. కాళేశ్వరం శైవ క్షేత్రానికి వచ్చే భక్తులకు మార్గంమధ్యలో లారీ డ్రైవర్స్ పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నారు. రోడ్డంతా మాదే.! అన్నట్లు భరితెగిస్తున్న ఇసుక లారీ డ్రైవర్లు కాళేశ్వరం – మహాదేవపూర్ మధ్య జాతీయ రహదారిపై సామాన్య వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. మహదేవపూర్ – కాళేశ్వరం మద్దులపల్లి, పలుగుల వరకు రోడ్లపై వందలాది ఇసుక లారీలను ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. రహదారిపై మూడు లైన్లలో ఇసుక లారీ లే వెళ్తున్నాయి. దీంతో సాధారణ వాహనదారులకు దారిలేకుండా పోయింది.

రోడ్లపై ఇసుక లారీలు నిలుపడంతో ఆయా గ్రామాలకు వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నాయి. అత్యవసర పరిస్థితులలో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మూడు లైన్లలో ఇసుక లారీలు మొహరించడంతో కనీసం టూవీలర్స్, ఆటోలకు కూడా దారి లేదు. ఇక స్కూళ్ళు, కాలేజీ విద్యార్థులు సమయానికి చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరం దైవ దర్శనం కోసం వచ్చే భక్తులకు కూడా ఈ మార్గంలో చుక్కలు చూపిస్తున్నారు. టీజీఎండీసీ అధికారులు, పోలీసులు స్పందించి రోడ్లపై లారీలను ఆపకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు