మహేష్‌తో ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? అందానికి మారుపేరు ఆ భామ

మహేష్‌తో ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? అందానికి మారుపేరు ఆ భామ

మహేష్ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కథను కూడా సిద్ధం చేశారు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఇప్పటికే మహేష్ బాబు లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు చేస్తున్నసినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కథను కూడా సిద్ధం చేశారు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఇప్పటికే మహేష్ బాబు లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పై ఫొటోలో మహేష్ బాబుతో ఉన్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న బ్యూటీ.

పై ఫొటోలో ఉన్న చిన్నది చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజీ సొంతం చేసుకున్న హీరోయిన్ ఆమె.. ఆ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు ఇటీవలే మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి హిట్ అందుకున్న రమ్యపసుపులేటి. ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. టిక్ టాక్ వీడియోలు ఆతర్వాత ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకున్న ఈ చిన్నది. హుషారు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమాలో చిన్న పాత్ర చేసింది.

ఆతర్వాత ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఇక రీసెంట్ గా రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తుంది రమ్య. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నటిస్తుంది రమ్య. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మడు గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యూట్ నెస్ తో పాటు అందాలతో ఆకట్టుకుంటోంది రమ్య పసుపులేటి.

Please follow and like us:
వార్తలు సినిమా