అనుష్క శెట్టి పని గురించి పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారింది. కానీ ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. ఇప్పుడిప్పుడే మళ్లీ తిరిగి సినిమాల్లో నటిస్తుంది.
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ అనుష్క. 2005లో విడుదలైన ఈమూవీలో నాగార్జున, సోనూసూద్, అయేషా టాకియా ప్రధాన పాత్రలో పోషించారు. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ మంచి ఫాలోయంగ్ సంపాదించుకుంది. విక్రమార్కుడు, లక్ష్యం, చింతకాయల రవి, సింగ, సింగం 2, బిల్లా, అరుంధతి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ఇక డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క జంటగా నటించిన బాహుబలి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఈ మూవీ తర్వాత అనుష్క ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. కానీ ఇప్పటికీ సినీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా దూసుకుపోతుంది అనుష్క.
అనుష్క ఎప్పుడూ సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంది. కానీ ఆమె సంపాదన, కార్ కలెక్షన్ చూస్తే మాత్రం దిమ్మతిరిగిపోద్ది. సినిమాల ద్వారానే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు , మోడలింగ ద్వారా డబ్బు సంపాదిస్తుంది. నటనలోకి రాకముందు అనుష్క యోగ శిక్షకురాలు. ప్రముఖ యోగా గురువు భరత్ ఠాకూర్ వద్ద శిక్షణ పొందింది. నివేదికల ప్రకారం అనుష్క ఆస్తుల విలువ రూ.140 కోట్లు. ఆమె నెలకు దాదాపు 1 కోటి వరకు సంపాదిస్తుంది. అలాగే సంవత్సరానికి రూ.12 కోట్లు సంపాదిస్తున్నట్లు అంచనా. ఒక్క సినిమాకు రూ.6 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.
అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుండి సంవత్సరానికి రూ.12 కోట్ల వరకు సంపాదిస్తుంది. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ అనుష్కకు రూ.12 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు కలిగి ఉందని టాక్. అలాగే హైదరాబాద్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో అందమైన ఫామ్‌హౌస్ కూడా ఉందట.
అనుష్క కార్ కలెక్షన్స్..
అనుష్క శెట్టి తన గ్యారేజీలో INR 20 లక్షల విలువైన టయోటా కరోలా ఆల్టిస్ (USD 24,036), INR 59.88 లక్షల విలువైన Audi Q5 (USD 71,964), INR 59 లక్షలు (USD 70,906) విలువైన Audi A6 (USD 70,906)తో సహా అనేక కార్లను పార్క్ చేసింది. విలువ INR 21 లక్షలు (USD 25,238), BMW 6 సిరీస్ ధర INR 70 లక్షలు (USD 84,126).