75 ఏళ్ల కిందట 10 గ్రాముల బంగారం ధర తెలిస్తే.. మీరు అర్జంట్‌గా టైమ్ మెషీన్ కావాలంటారు

75 ఏళ్ల కిందట 10 గ్రాముల బంగారం ధర తెలిస్తే.. మీరు అర్జంట్‌గా టైమ్ మెషీన్ కావాలంటారు

బంగారం..ఇప్పుడు ఎవరెస్టెక్కి కూర్చుంది. అదును చూసి మరి పదునెక్కింది. దిగమంటే దిగనంటుంది. మద్యతరగతి జీవికి చుక్కలు చూపిస్తోంది. పూరెగుడిసెలో బీదబీక్కికయినా….కోటలో ఉండే మహారాజుకయినా..బంగారం అవసరం. కొన్ని సందర్భాల్లో అయితే అత్యవసరం. అందుకే ఇప్పుడది ప్రతి ఒక్కవరికీ నిత్యావసరమైంది. బులియన్ మార్కెట్‌లో దాని దూకుడు చూస్తే మైండ్ బ్లోయింగ్. త్వరలోనే లక్షదాటినా ఆశ్చర్యం లేదు.

నీ ఇల్లు బంగారం ..కానే కానంటోంది గోల్డ్. పసిడి మిడిసి మిడిసి పడుతోంది..కాదు కాదు ఎగబాకుతోంది. బంగారమా మజాకానా ప్రపంచంలో దేనికీ ఇంత మిడిసిపాటుండదేమో…దాని అన్‌స్టాపబుల్ స్పీడ్‌కు మద్యతరగతికి చుక్కలు కనిపిస్తున్నాయి..దాని రేంజ్‌ ఏలెవల్లో పెరుగుతోందంటే…ఈ క్యాలెండర్‌ ఇయర్‌లోనే అంటే 2024లోనే ఏకంగ 31శాతం పెరిగింది. ఊహించామా..ఈరేంజ్‌ హైను. అదే 2005నుంచి 2024వరకు చూస్తే..దాని పెరుగుదల శాతం ఎంతో తెలుసా…గుండె దిటవు చేసుకుని వినండి..జారిపోగలదు. ముఖ్యంగా అమ్మలు అక్కలు చెల్లెల్లు కేవలం ఈ20ఏళ్లలో బంగారం ధర ఎంతపెరిగిందంటే.. 455శాతం. పర్ సపోజ్ 2005లో మీరు కానీ ఓ పదివేలు పెట్టి బంగారం కొనుంటే..అదిప్పుడు ఎంతయ్యేదో మీకు తెలుస్తోందా…అట్లుంటది బంగారంతోని.

అందుకే పెద్దలనేది లక్ష రూపాయులున్నా జరగని మేలు….కాసు బంగారంతో అవుద్దట. ఇప్పుడు మన బంగారం రేటు పది గ్రాములొచ్చి..24క్యారెట్స్…80వేల మార్కు దాటింది. చరిత్రలో తొలిసారి హై రేంజ్‌ కు వెళ్లింది. 75 ఏళ్ల కిందట 10 గ్రాములు రూ.99 మాత్రమే. ఐదేళ్ల తర్వాత అంటే 1955లో ఇంకా రూ.20 తగ్గి రూ.79కి చేరింది. ఆహా టైమ్ మిషన్ కాని ఉంటే టక్కున 1955 జమానాకు వెళ్లి ఖజానా నిండుగా బంగారు తెచ్చుకోవాలనుందిలే. అందాకా ఎందుకు 2015 అంటే 9ఏళ్ల కిందట తులం బంగారం కేవలం 26వేల343 రూపాయలు మాత్రమే… కానీ ఇప్పుడు దాని ధర 80వేలు…అంటే 9ఏళ్లకు ఏకంగా 55వేలు పెరిగింది.

పెరుగుట విరుగట కొరకే అంటారు పెద్దలు.. కానీ ఇదేంటో.. బంగారం, వెండి ధరలు పెరుగడం తప్ప తగ్గడంలేదు. వీటి అన్‌స్టాపబుల్ దెబ్బకు మద్యతరగతి కాసు కొనాలన్నా కళ్లు తేలేసే పరిస్థితికొచ్చింది. ఎందుకొచ్చిందంటే ఏం చెబుతాం. డిమాండ్ ఏమో కొండంత ఉండే…సప్లై చూస్తే గోరంత కూడా లేకపోయే. డిమాండ్ అండ్ సప్లై మధ్య అంతరం సమాంతరంగా ఉంటే రేటు కంట్రోల్‌లో ఉంటది…అదే పెరిగితే బంగారాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు…అసలే గోల్డ్..భారతీయుల నరనరానా బాగా ఇంకిపోయిన సింగారం. మతంతోనూ, సంప్రదాయంతోనూ, మన ఆచార వ్యవహారాలతోనూ లింకయిన వన్ అండ్ ఓన్లీ ఐటమ్….బంగారమే. ఇంట్లో బిడ్డ పుట్టాడంటే కాసు బంగారం… అక్షయతృతీయ వచ్చిదంటే బంగారం.. బర్త్‌డే వచ్చిందంటే బంగారం.. మ్యారేజ్ అయిందంటే బంగారం..చుట్టాలు పక్కాలింటికెళ్తే బంగారం….ఆడపిల్ల పుట్టిందంటే పెళ్లయ్యేదాకా…కాసో అరకాసో..వీలు చిక్కినప్పుడల్లా బంగారం కొని పోగేసుకుని పెళ్లినాటికి బిడ్డకు పెట్టి పంపడం మన మద్యతరగతి కుటుంబీకుల అలవాటు..అందుకే బంగారానికి అంత డిమాండు…. ఒక్కసారి 1992నుంచి ఇప్పటిదాకా అంటే ఈ 32ఏళ్లలో బంగారం ఎలా పెరిగిందో తెలుసుకుందాం….

1992లో దాని రేటు మహాఅంటే 5వేలు కూడా దాటలేదు. అలా పెరుగుతూ పెరుగుతూ…2024కు ఏకంగా 80వేలకు చేరింది. 1960లో బంగారం ధర 111రూపాయలుండేది. తర్వాత ఐదేళ్లకు అంటే 1965లో ఏకంగా రూ.39 తగ్గి 20 ఏళ్లలో కనిష్టంగా రూ.72కు చేరింది. ఆ తర్వాత ఏటికేడు ధరలు పెరుగుతూ వచ్చాయి. 2008లో తొలిసారిగా పది గ్రాముల బంగారం రూ.10వేల మార్క్‌ దాటింది. అప్పట్లో దీనిపై పెద్ద చర్చే నడిచింది. అయితే.. రెండేళ్లలోనే అంటే 2010లో ఏకంగా రూ.8 వేలకు పైగా పెరిగి రూ.18వేల మార్క్‌ను దాటింది. 2015లో రూ.26,343 ఉండేది. ఇప్పుడు 80వేలకు చేరింది…అంటే క్యాష్ వర్సెస్ గోల్డ్ పోరాటంలో క్యాష్ ఓడిపోతోంది కానీ..బంగారం ఎప్పుడూ ఓడినట్లు చరిత్రలోలేదు.

అసలే ఆశ్వీయుజ మాసం కావడంతో ఓవైపు ఫెస్టివల్స్‌..మరోవైపు మ్యారేజెస్…దీంతో బంగారం కొండ కాదు..ఎవరెస్ట్ ఎక్కి కూర్చుంది. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు బంగారు ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. బంగారం కొనుగోలు చేసే దేశాల్లో ప్రపంచంలోనే మన దేశం రెండో స్థానంలో ఉంది. పదేళ్లుగా బంగారం ధరలు వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. మూణ్ణెళ్ల కిందట జూలైలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.75వేల వరకూ ట్రేడ్‌ అయింది. అదే 22 క్యారెట్లు రూ.68,800 చేరింది. అయితే, కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా 10 గ్రాములపై రూ.6 వేల వరకూ తగ్గింది.

బంగారం, వెండి, ప్లాటినంతో పాటు విలువైన లోహాలపై 10 శాతం బీసీడీ అంటే బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ ఉండేది. దీనికి అదనంగా ఏఐడీసీ అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ 5 శాతం ఉండేది. కేంద్రం బీసీడీని 5 శాతం, ఏఐడీసీని 4 శాతం తగ్గించింది. కస్టమ్స్‌ సుంకం ఆరు శాతానికే పరిమితం చేసింది. దీంతో మొత్తంగా జీఎస్టీతో కలిపి బంగారు, వెండిపై 18 శాతం ఉన్న సుంకం 9 శాతానికి తగ్గింది. ఫలితంగా.. బంగారు, వెండి ధరలు జూలైలో తగ్గుముఖం పట్టాయి. అంటే.. 22 క్యారెట్ల బంగారం రూ.63 వేలకు.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.70వేలకు తగ్గింది. కేంద్రం దిగుమతి సుంకం తగ్గించడంవల్లే ధరలు తగ్గుముఖం పట్టాయని, మరింతగా తగ్గే అవకాశం ఉందని బంగారం కొనేందుకు ఇదే అనువైన సమయమని అప్పట్లో అంతా భావించారు. ఇంకొందరు మరికొంత తగ్గుతాయని వేచిచూశారు. కానీ బుధవారం ఏకంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.80,070కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.73,400కు పెరిగింది. కేంద్రం స్మగ్లింగ్‌ను నివారించేందుకు తగ్గించిన సుంకం మార్కెట్‌పై పెద్దగా ప్రభా­వం చూపలేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి.

పదేళ్ల కిందట బంగారం కంటే విలువైన లోహం ఏముండేది..ప్లాటినం. బాగా డబ్బున్న కోటీశ్వరులు బంగారం కంటే ప్లాటినం ఆభరణాలు కొనుగోలు చేసేవారు. చూసేందుకు వెండిలానే కనిపించినా దాని వాల్యూ హైరెంజ్‌వాళ్లకే ఆనుద్ది. అప్పట్లో బంగారం కంటే ప్లాటినం ధర ఎక్కువగా ఉండటంతో ఏదైనా శుభకార్యానికి ప్లాటినం నగలతో వచ్చే స్త్రీలను ప్రత్యేకంగా చూసేవారు. అయితే, ఇప్పుడు ప్లాటినంను దాటి బంగారం ధర రెట్టింపు అయింది. ఇప్పుడు ప్లాటినం ధర ఎంతో తెలుసా…10గ్రాములు 27వేల 700 తిప్పికొడితే 30వేలు కూడా దాటలేదు.

బంగారంతో పోల్చితే..ఇప్పుడు ప్లాటిన ధరం సగానికి సగం. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా ప్లాటినంతో పోలిస్తే బంగారం కొనుగోళ్లు అధికం. ఫారెక్స్‌ మార్కెట్‌లో కూడా ప్లాటినం కంటే బంగారంపైనే పెట్టుబడులు అధికం. అందుకే గోల్డ్‌ ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో సామాన్యులు కొనే పరిస్థితి లేదు. ఇలా ధరలు పెరిగిపోతూ ఉంటే ఆచితూచి కొనాల్సి వస్తోంది.

బంగారం ధర రూ.80­వేలు దాటింది. మేకింగ్‌ చార్జీలు, జీఎస్టీ అంతా కలిపి రూ. లక్ష అవుతోంది. 10 గ్రాముల బంగారాన్ని దాదాపు రూ.లక్ష పెట్టి కొనడమంటే చాలా కష్టం. చైన్‌ హుక్‌ పోతే చేయించడానికి రూ.10 వేలు అవుతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. పెళ్లిళ్లు ఉన్న వారికి పెరిగిన గోల్డ్‌ ధరలు అదనపు భారమే.

Please follow and like us:
బిజినెస్ వార్తలు