చల్ల గాలిలో వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ తప్పు మాత్రం చేయకండి..!

చల్ల గాలిలో వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ తప్పు మాత్రం చేయకండి..!

చలికాలంలో 50 ఏళ్ల వరకు వయస్సు ఉన్నవారు వాకింగ్ చేస్తే కొంత పర్వాలేదు. ఆ వయసు పైబడిన వృద్ధులు వాకింగ్ చేస్తే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. ఈమధ్య హైదరాబాదులో గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో బెల్స్ పాల్సి కేసులు నమోదవుతున్నాయి. ఫీవర్ ఆసుపత్రిలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి.

చల్లని శీతాకాలం.. అందులోనూ ఉదయం పూట చలి చలిగా… మంచు కురుస్తుండగా వాకింగ్ చేస్తుంటే ఆ ఫీలే వేరు. సినిమాల్లో ఊటీ కొడైకెనాల్ సీన్లు గుర్తొస్తూ ఉంటాయి. వాకింగ్ అలవాటు ఉన్నవాళ్లు ఇంకాస్త జోరుగా ఈ వింటర్ సీజన్లో వాకింగ్ చేస్తారు. అయితే ఈ చలికాలంలో 50 ఏళ్ల వరకు వయస్సు ఉన్నవారు వాకింగ్ చేస్తే కొంత పర్వాలేదు. ఆ వయసు పైబడిన వృద్ధులు వాకింగ్ చేస్తే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. ఈమధ్య హైదరాబాదులో గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో బెల్స్ పాల్సి కేసులు నమోదవుతున్నాయి. ఫీవర్ ఆసుపత్రిలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి.

చల్లగాలిలో వాకింగ్ చేస్తున్నప్పుడు చెవుల్లోకి ఆ చలిగాలు వెళ్లడం అది మెదడు నాడి వ్యవస్థపై ప్రభావం చూపి మూతి వంకరపోవడం.. ముఖంపై ఉన్న కండరాలు వాచిపోవడం జరుగుతుంది. ఇది వృద్ధుల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దీన్నే అంతర్జాతీయంగా బెల్స్ పాల్సి వ్యాధి అంటారు. కామన్‌గా వాకింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ శ్వాస తీసుకుంటాం… చెవుల్లోంచి కూడా కొంత గాలి లోపలికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా చలికాలంలో వాకింగ్ చేస్తున్నప్పుడు ఉదయం పూట మంచుతో కూడిన చల్లటి గాలి మెదడు లోపలికి వెళ్లడం వల్ల వచ్చే ఇన్ఫెక్షనే ఈ వ్యాధి.. కేవలం మూతి వంకర పోవడమే కాదు.. అలాగే వదిలేస్తే మెదడు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుందంటున్నారు వైద్యులు.. మెదడులో కణతులు దెబ్బ తినడం, గవద బిళ్ళలు ఇన్ఫెక్షన్ కారణంగా వాచిపోవడం… చెవుల్లో నొప్పి లాంటివి వస్తూ ఉంటాయి. ఎవరికైనా దవడ ఒక పక్కకు లాగినట్లుగా అనిపించినా… చెవుల్లో నొప్పి ఉన్నట్టుగా అనిపించిన వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. ఇక ఉదయం ఐదు గంటల నుంచి 7:00 వరకు వాకింగ్ చేయకపోవడమే ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ వచ్చాక వాకింగ్ చేస్తే బెటర్ అని వైద్యులు సలహాలు ఇస్తున్నారు. లేదా వృద్ధులైతే చెవులు మూసుకునేలా మంకీ క్యాప్ ధరించి వాకింగ్ చేస్తే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. డిసెంబర్ జనవరి సీజన్లో ఉదయం పూట వాకింగ్ టైమింగ్ మార్చుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

Please follow and like us:
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు