అమరావతి రైతుల పాదయాత్ర.. సీఎం చంద్రబాబు నిర్ణయంపై హర్షం..

అమరావతి రైతుల పాదయాత్ర.. సీఎం చంద్రబాబు నిర్ణయంపై హర్షం..

ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి రైతులు దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. రాజధాని రైతుల ఉద్యమ ఆకాంక్ష నెరవేరడంతో అమరావతి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్ర చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరి.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన ప్రారంభించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి సందర్శించి.. రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి రైతులు దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. రాజధాని రైతుల ఉద్యమ ఆకాంక్ష నెరవేరడంతో అమరావతి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్ర చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరి.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన ప్రారంభించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి సందర్శించి.. రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. దాంతో గత ప్రభుత్వం మూడు రాజధానులు ప్రకటించిన నాటి నుంచి నిరసనలు చేస్తున్న అమరావతి రైతులు.. చంద్రబాబు హామీపై హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలో రాజధానికి మళ్లీ అడుగులు పడుతుండగా.. ఉద్యమ ఆకాంక్ష నెరవేరిందంటూ విజయవాడ దుర్గమ్మ ఆలయం వరకు అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టారు. రాజధాని ఉద్యమం విజయం సాధించడంతో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేశారు. తెల్లవారుజామున తుళ్లూరు శిబిరం దగ్గర రైతులు, మహిళలు పొంగళ్లు చేసుకుని పూజలు నిర్వహించారు.

ఆ తర్వాత కాలినడకన ఇంద్రకీలాద్రికి వెళ్లి.. దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పొంగళ్లు, చీర-సారె సమర్పించారు. తుళ్లూరు నుంచి రాయపూడి, రాజధాని సీడ్‌ యాక్సెస్‌ రహదారి, కరకట్ట, ప్రకాశం బ్యారేజీ మీదుగా ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్ర కొనసాగగా.. రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక గత ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించిన అమరావతి రైతులు.. 2020 జనవరి 10న విజయవాడ దుర్గమ్మకు మొరపెట్టుకునేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుంటామని మొక్కుకున్నట్లు తెలిపారు రాజధాని రైతులు. ఆ కోరిక నెరవేరడంతో తుళ్లూరు నుంచి ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్ర చేసి.. దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నామన్నారు. రాబోయే ఐదేళ్లలో అమరావతి మరింత అభివృద్ధి చెందేలా చూడాలని దుర్గమ్మను కోరుకున్నామని చెప్పారు రాజధాని రైతులు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు