విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్న కారణంగా ఘాట్ రోడ్డు ఆదివారం ( జులై 14) మూసివేశారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్డును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. మహా మండపం నుంచి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. కొండరాళ్ళు దొర్లిపడకుండా ముందస్తుగా ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు.
దుర్గాఘాట్ నుంచి దేవస్థానం బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఒకవైపు ఆదివారం( జులై 14) సెలవు రోజు కావడంతో దుర్గమ్మ కు ఆషాఢం సారె సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. వాహనాలను నిలిపేందుకు రధం సెంటర్, పద్మావతి ఘాట్ల వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.