మిర్చి ధరలు ఢమాల్‌.. కోల్డ్‌ స్టోరేజీల్లో కొండల్లా పెరిగిపోతున్న నిల్వలు

మిర్చి ధరలు ఢమాల్‌.. కోల్డ్‌ స్టోరేజీల్లో కొండల్లా పెరిగిపోతున్న నిల్వలు

రాష్ట్రంలో మిర్చి ధరలు పతనమయ్యాయి. గత ఏడాది మేలో క్వింటాల్‌ మిర్చి కనీస ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.26,500 పలికాయి. ఈ ఏడది ధరలు తగ్గడంతో క్వింటాల్‌ కనీస ధర రూ.8 వేలు, గరిష్ట ధర 20,700కి పడిపోయింది. తేజ మంచి రకానికి చెందిన మిర్చీ మాత్రమే క్వింటాల్‌ రూ.19,500 ధర పలుకుతోంది. మిగిలిన అన్నిరకాల మిర్చి ధరలు గణనీయంగా తగ్గాయి. ఎగుమతులు ప్రారంభంకాకపోవడంతో..

రాష్ట్రంలో మిర్చి ధరలు పతనమయ్యాయి. గత ఏడాది మేలో క్వింటాల్‌ మిర్చి కనీస ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.26,500 పలికాయి. ఈ ఏడది ధరలు తగ్గడంతో క్వింటాల్‌ కనీస ధర రూ.8 వేలు, గరిష్ట ధర 20,700కి పడిపోయింది. తేజ మంచి రకానికి చెందిన మిర్చీ మాత్రమే క్వింటాల్‌ రూ.19,500 ధర పలుకుతోంది. మిగిలిన అన్నిరకాల మిర్చి ధరలు గణనీయంగా తగ్గాయి. ఎగుమతులు ప్రారంభంకాకపోవడంతో కోల్డ్‌ స్టోరేజీల్లో మిర్చీ నిల్వలు పేరుకుపోతున్నాయి. ఇప్పటికే 75 లక్షల మిర్చి బస్తాలు అక్కడ నిల్వ ఉన్నాయి.

ఆరుగాలంపాటు చమటోడ్చి పండించిన మిర్చీ పంటను అమ్ముకుని నాలుగు కాసులు చూస్తామనుకున్న రైతుకు ధరలు పడిపోవడంతో నిరాశ ఎదురైంది. ఎగుమతులు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో తొలకరి ప్రారంభం కావడంతో మిరప నాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. మన దేశం నుంచి సుమారు 20 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతుంది. మిర్చి ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. 2022-23 వార్షిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.10,440 కోట్ల విలువైన మిర్చి విదేశాలకు ఎగుమతైంది. లాభాలు ముట్టడంతో గత రెండేళ్లుగా రైతులు మిర్చి పంటపైనే దృష్టి పెడుతున్నారు.

అటు కర్ణాటకలో మిర్చి దిగుబడి ఎక్కువగా రావడంతో అక్కడ కోల్డ్‌ స్టోరేజీలు సరిపోక ఏపీకి తీసుకొచ్చి నిల్వ చేస్తున్నారు. గుంటూరులో దాదాపు వంద వరకూ కోల్డ్‌స్టోరేజీలు ఉన్నాయి. వీటిల్లో 3.21 లక్షల టన్నులకు పైగా మిర్చిని నిల్వ చేశారు. ఇందులో 2.71 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట రైతులది. మిగిలిన 52 వేల మెట్రిక్‌ టన్నుల పంట వ్యాపారులది. ఇక పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఉన్న కోల్డ్‌ స్టోరేజీలల్లోనూ 75 లక్షల బస్తాల పంట నిల్వ ఉంది. ఒక్కో బస్తా 40 కిలోలు ఉంటుంది. ఉత్పత్తి పెరడం వల్ల ధర రోజురోజుకీ తగ్గుతుండటం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు