టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక..
తెలంగాణ వార్తలు

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక..

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక వచ్చింది. చాలావరకు ప్రభుత్వ ఆఫీసులు, ఆస్పత్రుల్లో సమయ పాలన కనిపిస్తోంది. ఉదయం పదిన్నర కల్లా ఆఫీసుల్లో అటెండెన్స్‌ వేయించుకుంటున్నారు ఉద్యోగులు. ఇక సర్కారీ దవాఖానాలకు ఉదయం 9 గంటల కల్లా వైద్యులు, వైద్య సిబ్బంది చేరుకుంటున్నారు. అయితే హైదరాబాద్‌కి…

రేవంత్ సర్కార్‌ కరెంట్ బిల్లుల వసూలు బాధ్యతలు ఆదానీ సంస్థకు ఇచ్చేసిందా?
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్‌ కరెంట్ బిల్లుల వసూలు బాధ్యతలు ఆదానీ సంస్థకు ఇచ్చేసిందా?

హైదరాబాద్‌ పాతబస్తీలో కరెంట్ బిల్లుల వసూలు అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. గతంలో బిల్లులు అడిగితే దాడులు జరిగిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో బిల్లుల వసూలు బాధ్యత ఆదానీ గ్రూప్‌కి ఇచ్చారనే వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇంతకీ రేవంత్ సర్కార్‌ కాంట్రాక్ట్‌ బాధ్యతలు ఆదానీ సంస్థకు…

ఉధృతంగా పారుతున్న జంపన్న వాగు
తెలంగాణ వార్తలు

ఉధృతంగా పారుతున్న జంపన్న వాగు

ఎల్బక, పడిగాపూర్‌‌‌‌ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జంపన్న వాగు ఉధృతంగా పారుతోంది. దీంతో ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్‌‌‌‌ గ్రామం చింతల్‌‌‌‌క్రాస్‌‌‌‌ నుంచి పడిగాపూర్‌‌‌‌, ఎల్బక గ్రామాలకు వెళ్లే రోడ్డులో జంపన్న వాగుపై ఉన్న వంతెన వరదతో మునిగిపోయింది. దీంతో…

ఆషాఢం జాతర మొదలైంది..గోల్కొండ జగదాంబికకు తొలి బోనం
తెలంగాణ వార్తలు

ఆషాఢం జాతర మొదలైంది..గోల్కొండ జగదాంబికకు తొలి బోనం

శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు.. నెత్తిన బోనం పెట్టుకుని తరలివచ్చే మహిళలతో బోనాల పండగ అంగరంగవైభవంగా జరుగుతుంది. తొలి బోనం సమర్పించే గోల్కొండలో బోనాల పండుగ కోలాహలం మొదలైంది. గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.…

పార్టీ ఫిరాయింపులపై మాటల ఫిరంగులు.. బీజేపీలో చేరాలంటే అలా చేయాల్సిందే..
తెలంగాణ వార్తలు

పార్టీ ఫిరాయింపులపై మాటల ఫిరంగులు.. బీజేపీలో చేరాలంటే అలా చేయాల్సిందే..

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఫిరంగులు పేలుతున్నాయి. ఫిరాయింపుల ఎపిసోడ్‌పై బీఆర్ఎస్‌- కాంగ్రెస్‌ మధ్య మాటలయుద్ధం జరిగింది. తమ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత నిరంజన్‌రెడ్డి ప్రశ్నించగా.. గతంలో మీ పార్టీ చేసిందేంటి అని కౌంటర్‌ ఎటాక్‌ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ రాజకీయాల్లో…

జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు..
తెలంగాణ వార్తలు

జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు..

ఆషాడం ప్రారంభమైన తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు.. జులై 07 ఆదివారం నాడు గోల్కొండలో బోనాలు ప్రారంభం.. ఆగస్టు 04 ఆదివారంతో బోనాలు ముగింపు.. జ్యేష్ఠ మాసంలో అమావాస్య నాడు వచ్చే పాడ్యమి నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాడం ప్రారంభమైన తర్వాత వచ్చే గురువారం…

నేడు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రి కీలక భేటీ.. ఎవరి డిమాండ్లు ఏంటంటే..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రి కీలక భేటీ.. ఎవరి డిమాండ్లు ఏంటంటే..?

నేడు ఏపీ- తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం.. హైదరాబాద్ వేదికగా రాష్ట్ర విభజన అంశాలపై భేటీ.. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులు.. ప్రధాన కార్యదర్శలు హాజరు.. ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌ లో ఈ రోజు…

బీఆర్ఎస్‎లో మరో కుదుపు.. పెద్ద ఎత్తున కాంగ్రెస్‎లో చేరిన ఎమ్మెల్సీలు..
తెలంగాణ వార్తలు

బీఆర్ఎస్‎లో మరో కుదుపు.. పెద్ద ఎత్తున కాంగ్రెస్‎లో చేరిన ఎమ్మెల్సీలు..

తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద కుదుపు ఏర్పడింది. బీఆర్‌ఎస్‌కి ఆరుగురు ఎమ్మెల్సీలు బిగ్‌ షాకిచ్చారు. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్‌లోకి జంప్‌ అయ్యారు. సీఎం రేవంత్‌ సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిని కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్‌ మున్షీ.…

ఆ పుణ్య క్షేత్రానికి వెళ్లాలంటే నరకమే.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు..
తెలంగాణ వార్తలు

ఆ పుణ్య క్షేత్రానికి వెళ్లాలంటే నరకమే.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు..

ఇసుక లారీ డ్రైవర్ల బరితెగింపుతో అక్కడ సామాన్యులు నరకం అనుభవిస్తున్నారు. దీంతో ఆ జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‎గా మారింది. కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లే దారి లేదు. ప్రశ్నిస్తే ఆ లారీ డ్రైవర్లు సామాన్యులపైన ప్రతాపం చూస్తున్నారు. కాళేశ్వరం శైవ క్షేత్రానికి వచ్చే భక్తులకు…

ఢిల్లీలో జోరందుకున్న తెలంగాణ రాజకీయం.. అసలు ఏం జరుగుతోంది..
తెలంగాణ వార్తలు

ఢిల్లీలో జోరందుకున్న తెలంగాణ రాజకీయం.. అసలు ఏం జరుగుతోంది..

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరమైన అంశాలపై సమావేశాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పెద్దలతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ కలవనున్నారు. నేడు కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానంతో మరోసారి చర్చలు జరిపే అవకాశం…