పదేళ్లలో రూ. 8.5 లక్షలు సొంతం చేసుకునే అవకాశం.. నెలకు ఎంత పెట్టుబడి అంటే

 పదేళ్లలో రూ. 8.5 లక్షలు సొంతం చేసుకునే అవకాశం.. నెలకు ఎంత పెట్టుబడి అంటే

సంపాదించిన సొమ్మును పొదుపు చేయాలనుకుంటున్నారా.? ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి రిటర్న్స్‌ వచ్చే ప్లాన్స్‌ కోసం వెతుకుతున్నారా.? మీలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌లో మంచి పథకం అందుబాటులో ఉంది. రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ పేరుతో అందుబాటులో ఉన్న ఈ పథకంలో చేరడం వల్ల 10 ఏళ్లలోనే రూ. 8.5 లక్షలు చేతికొస్తాయి. ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఖర్చులు పోను పొదుపు చేసుకోవాలనేది పాత ట్రెండ్‌. ఇప్పుడు పొదుపు చేసుకున్న తర్వాత మిగిలింది ఖర్చు చేసేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఆర్థికంగా ప్రతీ ఒక్కరిలో క్రమశిక్షణ పెరిగిందని చెప్పేందుకు ఇదే నిదర్శనం. ఇందుకు అనుగుణంగానే బ్యాంకులతో పాటు పోస్టాఫీస్‌ వంటి సంస్థలు రకరకాల పథకాలను ప్రవేశపెడుతున్నారు. పోస్టాఫీస్‌ అందిస్తోన్న అలాంటి ఓ బెస్ట్‌ సేవింగ్ స్కీమ్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫీస్‌ అందిస్తోన్న బెస్ట్‌ స్కీమ్స్‌లో రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ఒకటి. ఈ చిన్న పొదుపు పథకంలో పెట్టుబడి పెడితే 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో ప్రతీ నెల నిర్ణీత మొత్తంలో పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. ఈ పథకంలో మెచ్యూరిటీ ఐదేళ్లు ఉంటుంది. అయితే ఆ తర్వాత మరో ఐదేళ్లకు కూడా పెంచుకోవచ్చు. మొన్నటి వరకు వడ్డీ 6.5 శాతం ఉండగా ఇప్పుడు దీనిని 6.7 శాతానికి పెంచారు. ఈ పథకంలో రూ. 100 నుంచి పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు.

ఒక ఏడాది పాటు కంటిన్యూగా పెట్టుబడి పెడితే ఆ తర్వాత పెట్టుబడి పెట్టిన మొత్తంలో 50 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. అయితే ఇందుకు 8.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఉదాహరణకు ఈ పథకంలో నెలకు రూ. 5 పెట్టుబడి పెడుతూ వెళ్లారనుకుందాం. ఐదేళ్లలో రూ. 3 లక్షలు డిపాజిట్‌ అవుతాయి. దీనికి వడ్డీ రూపంలో రూ. 56,830 జమ అవుతాయి. దీంతో మొత్తం రూ. 3,56,830 అవుతుంది. అయితే మరో ఐదేళ్లు పొడగిస్తే 10 ఏళ్లకు అసలు రూ. 6 లక్షలు అవుతుంది. వడ్డీతో కలుపుకుంటే పదేళ్లలో రూ. 8.5 లక్షలు చేతికి వస్తాయి.

ఎలాంటి రిస్క్‌ లేకుండా, మీ సొమ్ముకు భద్రంగా ఉంటూనే మంచి రిటర్న్స్‌ పొందేందుకు ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇక ఈ పథకంలో పెట్టుబడి పెడితే వడ్డీపై టీడీఎస్‌ ఉండదు. ఐటీఆర్‌ క్లెయిమ్‌ చేసిన తర్వాత ఆదాయం ప్రకారం తిరిగి చెల్లిస్తారు. ఆర్డీపై వచ్చే వడ్డీపై 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. RD పై వడ్డీ రూ. 10 వేల కంటే ఎక్కువ ఉంటే.. TDS తీసి వేస్తారు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు