ఎంత మంచిదో.. అంత చెడు చేస్తుంది.. ఈ 5 రోగాలుంటే వంకాయ అస్సలు తినకండి..!

ఎంత మంచిదో.. అంత చెడు చేస్తుంది.. ఈ 5 రోగాలుంటే వంకాయ అస్సలు తినకండి..!

వంకాయ చాలా మందికి ఇష్టమైన కూరగాయ. వంకాయ రుచిని చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ మెచ్చుకుంటారు.. ఇష్టంగా తింటారు.. వంకాయను కూర, ఫ్రై, చట్నీ ఇలా .. ఎన్నో రకాలుగా చేసుకుని ఆరగిస్తారు. వీటిల్లో ఎన్ని రకాలున్నా.. సరే వాటన్నింటిని పలు రకాలుగా తయారు చేసుకుని ఇష్టంగా తింటారు.

వంకాయ చాలా మందికి ఇష్టమైన కూరగాయ. వంకాయ రుచిని చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ మెచ్చుకుంటారు.. ఇష్టంగా తింటారు.. వంకాయను కూర, ఫ్రై, చట్నీ ఇలా .. ఎన్నో రకాలుగా చేసుకుని ఆరగిస్తారు. వీటిల్లో ఎన్ని రకాలున్నా.. సరే వాటన్నింటిని పలు రకాలుగా తయారు చేసుకుని ఇష్టంగా తింటారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. దీనిలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అయితే, వంకాయ తినడం కొందరికి విషంలా హానికరం కావొచ్చు.. ఎందుకంటే.. కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు వంకాయను తినకపోవడమే మంచిది. ఈ రోజు మనం వంకాయ తినడం వల్ల ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చగల ఐదు సమస్యల గురించి మీకు చెప్పబోతున్నాం. ఈ ఐదు సమస్యలు ఉన్నవారు వంకాయను ఎప్పుడూ తినకూడదు.. ఎందుకంటే వంకాయ తినడం వారికి తీవ్రంగా హాని కలిగిస్తుంది.

చెడు జీర్ణక్రియ: గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు వంకాయ తినకుండా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో వంకాయ తింటే జీర్ణ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి పేలవమైన జీర్ణక్రియ లేదా గ్యాస్ లేదా అసిడిటీ ఉన్నవారు వంకాయ తినకుండా ఉండటం మంచిది.


రక్తహీనత: రక్తహీనతతో బాధపడేవారు కూడా వంకాయ తినకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం. వంకాయలో శరీరంలో ఐరన్ శోషణను తగ్గించే అంశాలు ఉన్నాయి. దీని కారణంగా, రక్తం లేకపోవడం సమస్య తీవ్రమవుతుంది. రక్తహీనత ఉన్నవారు వంకాయను తినకూడదు.


కిడ్నీల్లో రాళ్లు: మూత్రపిండాల వ్యాధి లేదా రాళ్లు ఉన్నవారు వంకాయ తినకుండా ఉండాలి. వంకాయలో ఆక్సలేట్ ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నవారు వంకాయను ఆహారంలో చేర్చుకోకుండా ఉండటం మంచిది.

కీళ్ల నొప్పులు : కీళ్ల నొప్పులు ఉన్నవారు వంకాయను తినకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వంకాయలో సోలనిల్ ఉంటుంది. దీని కారణంగా, శరీరం వాపు, కీళ్ల నొప్పులు పెరుగుతాయి.


అలర్జీలు : చాలా సందర్భాలలో వంకాయ తినడం వల్ల అలర్జీ వస్తుంది. వంకాయ తిన్న తర్వాత మీకు ఇలా అనిపిస్తే, మీ వైద్యుడిని సంప్రదించండి.. వంకాయ తినడం మానేయండి. ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వంకాయ తినకుండా ఉండటం చాలా మంచిది.

Please follow and like us:
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు