ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని.. హైడ్రా పేరుతో సామాన్యులను ఇబ్బందిపెడుతున్న ప్రభుత్వానికి బండ్ల గూడ సలకం చెరువులో ఒవైసీ సోదరుల అక్రమ నిర్మాణాలు కపిపించడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. అవసరమైతే హైడ్రా కమిషనర్‌కి ఒవైసీ బ్రదర్స్ అక్రమ నిర్మాణాలను తానే స్వయంగా చూపిస్తానని వాటినే…
రాజకీయంగా కాకరేపుతోన్న’హైడ్రా’.. పీక్స్‌కి చేరిన వ్యవహారం..
హైడ్రా కూల్చివేతలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. పెద్దోళ్ల అక్రమ నిర్మాణాలు కూలిస్తే ఒకే కానీ.. పేద వారిపైనే మీ ప్రతాపమా అని ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుబడుతున్నాయి. అయితే ఎవరెంత ఒత్తిడి తెచ్చినా.. చెరువులను పరిరక్షించే విషయంలో తగ్గేదేలేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. అక్రమ నిర్మాణాలు చేపట్టినవాళ్లు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని.. ముఖ్యంగా తమ పార్టీకి సంబంధించిన వారు ఉన్నా వదిలేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ హైడ్రా యాక్షన్ పై అటు , బీఆర్ఎస్ ఇటు బీజేపీ విమర్శలతో సాగిన రాజకీయాలు రెండు రోజులు నుంచి ఎంఐఎం వైపు మళ్లాయి. తాజాగా హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి ఎంఐఎంను టార్గెట్ చేసింది బీజేపీ. హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ న్యూసిటీకే పరిమితమా అని ప్రశ్నిస్తోంది.? సీఎం రేవంత్ రెడ్డికి పాతబస్తీ చెరువుల కబ్జాలు తొలగించే దమ్ము ఉందా అని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నిలదీశారు.
ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని.. హైడ్రా పేరుతో సామాన్యులను ఇబ్బందిపెడుతున్న ప్రభుత్వానికి బండ్ల గూడ సలకం చెరువులో ఒవైసీ సోదరుల అక్రమ నిర్మాణాలు కపిపించడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. అవసరమైతే హైడ్రా కమిషనర్‌కి ఒవైసీ బ్రదర్స్ అక్రమ నిర్మాణాలను తానే స్వయంగా చూపిస్తానని వాటినే కూల్చే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు కూల్చేస్తున్న హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఓవైసీ బ్రదర్స్ అనే చర్చ జోరుగా సాగుతోంది. ఒవైసీ బ్రదర్స్‌కి సంబంధించిన అక్రమ కట్టడాలపై హైడ్రా కు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి.
ఎక్స్ మాధ్యమం ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి పాతబస్తీ వాసులు ఫిర్యాదు చేశారు. బండ్లగూడ సలకం చెరువులో ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా విద్యాసంస్థలు నిర్మించారని.. చెరువులోనే బిల్డింగులు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదని ఎక్స్‌లో సీఎం రేవంత్‌ను జనాలు ప్రశ్నిస్తున్నారు . దీంతో ఫాతిమా కాలేజ్‌పై వస్తున్న ఫిర్యాదులపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. తన పై కక్ష ఉంటే తూటాలతో కాల్చాలని.. కానీ తమ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను అడ్డుకోవద్దన్నారు అక్బరుద్దీన్.
పేదలకు ఉచిత విద్యను అందించేందుకే 12 భవనాలను నిర్మించానని.. వీటిని ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుగా చూపిస్తున్నారని చెప్పారు అక్బరుద్దీన్. తాను బలహీనుడినయ్యానని శత్రువులు అనుకుంటున్నారని.. ఒక వేళ కూల్చివేతల వరకు వస్తే తన కాలేజీలోని విద్యార్థినులే సైన్యంగా మారి అడ్డుకుంటారని అక్బరుద్దీన్ హెచ్చరించారు. కాగా.. హైడ్రా కూల్చివేతలపై ఇప్పటికే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్, GHMC కార్యాలయం సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ భవనాలు ఎఫ్టీఎల్‌లో ఉన్నాయని వాటిని కూడా ప్రభుత్వం కూల్చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. అన్ని భవనాలకు ఒకే న్యాయం ఉండాలన్నదే తమ అభ్యంతరమన్నారు అసదుద్దీన్ ఒవైసీ. మరి హైడ్రా కూల్చివేతలపై అటు బీజేపీ ఇటు ఎంఐఎంల ప్రశ్నలకు రేవంత్ సర్కార్ దగ్గర సమాధానాలు ఉన్నాయా.. లేదా..అనేది వేచి చూడాలి.