రెండు టీమ్ లనుంచి కొంతమందిని సెలక్ట్ చేసి ఈ టాస్క్ ఆడించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఓజీ క్లాన్ రెండు రౌండ్స్ గెలిచింది. కానీ ఆ తర్వాత మిగిలిన అన్నీ రౌండ్స్‌ను రాయల్స్ క్లాన్ గెలిచింది. రాయల్ క్లాన్ గెలవడంతో ఆ టీమ్ కు ఓ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ కోసం పోటీ జరిగింది. ఇప్పటికే నిఖిల్, నబీల్, మెహబూబ్ ఇద్దరూ మెగా చీఫ్‌గా గా ఉన్నారు. ఇక ఇప్పుడు నాలుగో చీఫ్ కోసం పోటీ జరిగింది. టీవీలో చూపించన బొమ్మలు ఏ తలగడ (దిండు)పై ఉందో వెతికి దాన్ని తీసుకొని ముందుగా బాక్స్‌లోకి వెళ్లాలి. రెండు టీమ్ లనుంచి కొంతమందిని సెలక్ట్ చేసి ఈ టాస్క్ ఆడించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఓజీ క్లాన్ రెండు రౌండ్స్ గెలిచింది. కానీ ఆ తర్వాత మిగిలిన అన్నీ రౌండ్స్‌ను రాయల్స్ క్లాన్ గెలిచింది. రాయల్ క్లాన్ గెలవడంతో ఆ టీమ్ కు ఓ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ నుంచి ఇద్దరినీ తొలగించాలని చెప్పాడు. దాంతో నిఖిల్, నబీల్ ను ఇద్దరినీ తీసేశారు. నబీల్ నిఖిల్ అవుట్ అవ్వడంతో ఓజీ క్లాన్ లో మణికంఠ అలాగే అమ్మాయిలు మాత్రమే మిగిలారు. దాంతో గౌతమ్ వాళ్లతో డీల్ సెట్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకున్నాడు. గౌతమ్‌కి రెండు పాయింట్లు ఛార్జ్ యష్మీ ఇచ్చింది. తేజకి ప్రేరణ ఛార్జ్ ఇచ్చింది.
ఓవర్ స్మార్ట్ టాస్కు పూర్తయ్యిందని బిగ్ బాస్ చెప్పాడు. అయితే టాస్క్ లో అవుట్ అవ్వకుండా ఉన్న విష్ణుప్రియ, యష్మీ, మణికంఠ, ప్రేరణ, అవినాష్, గౌతమ్, నయని, హరితేజ, మెహబూబ్, గౌతమ్, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ.. మీరందరూ మెగా చీఫ్ కంటెండర్స్‌గా అని చెప్పాడు బిగ్ బాస్. ఆతర్వాత వీరందరికి కలిపి ఓ టాస్క్ ఇచ్చాడు. దాని పేరు పట్టుకో లేదా తప్పుకో. ఈ టాస్క్ లో హౌస్ మధ్యలో ఓ సర్కిల్ గీసి అందులో ఓ ఎముకను ఉంచాడు. ఎవరైతే ముందుగా ఆ బోన్ ను దక్కించుకుంటారో వారు మెగా చీఫ్ కంటెండర్స్‌గా ఉన్నవారిలో ఇద్దరినీ తీసెయ్యవచ్చు అని చెప్పాడు అలాగే ఎందుకు తొగలిస్తున్నారో రీజన్ కూడా చెప్పాలని అన్నాడు బిగ్ బాస్. దీనికి నిఖిల్‌ని సంచాలక్‌గా పెట్టాడు.
ఇక ఈ టాస్క్ లో బజార్ మోగగానే మెహబూబ్, గౌతమ్ ఇద్దరు చాలా కష్టపడ్డారు కాగా మెహబూబ్ సర్కిల్ దాటేశాడు. దాంతో గౌతమ్ చేతికి బోన్ వచ్చింది.. మెహబూబ్- అవినాష్‌ను గేమ్ నుంచి తప్పిస్తున్నట్లు చెప్పాడు. ఇద్దరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అందుకే తొలగిస్తున్నా అని చెప్పాడు. ఆతర్వాత అమ్మాయిలు బోన్ కోసం పోటీపడ్డారు. అయితే గౌతమ్ ఏ మాత్రం ఆలోచించకుండా ఒకొక్కరిని విసిరిపారేశాడు. తమ్ చేతికే మళ్లీ బోన్ దక్కింది. విష్ణుప్రియ-ప్రేరణ స్ట్రాంగ్.. కనుక వాళ్లిద్దరినీ తొలగించాడు. ఆతర్వాత కూడా గౌతమ్ చేతికే బోన్ వెళ్ళింది. యష్మీ- నయనిలను ఔట్ చేశాడు. ఆతర్వాత మణికంఠ చేతికి బోన్ చిక్కింది. అయితే మనోడు ఎప్పటిలానే పిచ్చిపని చేశాడు. అంత స్ట్రాంగ్ గా ఆడుతున్న గౌతమ్ ను వదిలేసి టేస్టీతేజ-హరితేజను తొలగిస్తున్నా అని చెప్పాడు. అలాగే నేను గౌతమ్‌తో ఓ డీల్ పెట్టుకున్నా.. నన్ను లాస్ట్ వరకూ ఉంచుతా అని గౌతమ్ మాటిచ్చాడు అని చెప్పాడు. దానికి గౌతమ్ నేను ఆ డీల్ కు కట్టుబడి లేను అని చెప్పాడు. దాంతో మణికంఠ బిత్తరపోయాడు.. వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టు చెప్పి టేస్టీ తేజ-గౌతమ్‌ను తీయాలనుకుంటున్నా అని బిగ్ బాస్ కు చెప్పాడు. దాంతో గౌతమ్ అందుకున్నాడు. నువ్వు ఫస్ట్‌యే నా పేరు తీసెస్తే ఓకే కానీ వాళ్లు చెప్పాక ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యావ్ అని అన్నాడు. చివరికి సంచలక్ గా ఉన్న నిఖిల్ మణికంఠ మొదటి నిర్ణయాన్ని ఖరారు చేశాడు. దాంతో తేజ హరితేజ అవుట్ అయ్యారు. చివరకు రోహిణి, గంగవ్వ , గౌతమ్, మణికంఠ మిగిలారు. బోన్ దక్కించుకున్న గౌతమ్ రోహిణి, మణికంఠను తొలగించాడు. చివరకు గంగవ్వ నాకెందుకులే అన్నట్టు గౌతమ్ కు వదిలేసింది. అలా గౌతమ్ విన్ అయ్యి మెగా చీఫ్ గా నిలిచాడు.