కాగా తన భార్య పిల్లల కోసమే బిగ్ బాస్ షోకి వచ్చినట్లు నాగ మణికంఠ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. వారు తనకు దక్కాలన్న, అత్తారింటిలో గౌరవం పొందాలన్న బిగ్ బాస్ టైటిల్ గెలవాలి అనేవాడు. అలాంటిది ప్రేక్షకుల అభిప్రాయానికి వ్యతిరేకంగా, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేశాడు నాగ మణికంఠ.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మరో వారం ముగిసింది. ఏడో వీక్ లో అనూహ్యంగా నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఇలా చెప్పడం బదులు తనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు అని అనడం కరెక్ట్. 7వ వారం నామినేషన్స్ లో సైతం నాగ మణికంఠ కు భారీగా ఓట్లు పడ్డాయి. టాప్ 4-5లోనో ఉన్నట్లు.టేస్టీ తేజ, గౌతమ్ ఆఖరి రెండు స్థానాల్లో ఉన్నట్లు సమాచారం. ప్రేక్షకుల నిర్ణయం పరిగణణలోకి తీసుకున్నట్లయితే గౌతమ్ ఎలిమినేట్ కావాల్సింది. అయితే గత రెండు రోజులుగా నాగ మణికంఠ స్వయంగా ‘ ఆరోగ్యం బాగోలేదు. నా వల్ల కావట్లేదు. హౌస్ లో నుంచి వెళ్లిపోతాను’ అని గగ్గోలు పెట్టాడు. దీంతో నాగార్జున నాగ మణికంఠను బయటకు పంపించేశాడు. ఆదివారం (అక్టోబర్ 20)న జరిగిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ లో చివరికి నాగ మణికంఠ, గౌతమ్ మిగిలారు. అయితే నాగమణికంఠ తనే వెళ్లి పోతాను అన్నాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ ఓటింగ్ అడగ్గా అందరూ నాగమణికంఠనే పంపించేయమన్నారు. దీంతో నాగ మణికంఠ బయటకు వచ్చేశాడు. ‘గౌతమ కు తక్కువ ఓట్లు పడ్డాయి.. కానీ నువ్వు అడుగు తున్నావు కాబట్టి పంపిస్తున్నాను’ అని మణికంఠతో చెప్పాడు నాగార్జున.
ఇక నాగమణికంఠ స్టేజిపైకి వచ్చాక నాగార్జున నీకు ఓట్లు వేసిన వాళ్లకు ఏం చెప్తావు అని అడిగారు. దీనికి సమాధానంగా ‘ నాకు ఓట్లు వేసిన వాళ్లందరికీ సారీ. నేను మిమ్మల్ని ఏదో రకంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు నా ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. లక్ష్మీదేవి కంటే కూడా ఆరోగ్యమే ముఖ్యం కదా.. అందుకే బయటకు వచ్చేసాను అంటూ చెప్పుకొచ్చాడు నాగ మణికంఠ. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.
మరి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన నాగ మణికంఠ ఇప్పుడు ఏం చేస్తారో, ఎలాంటి అవకాశాలు సంపాదించుకుంటాడో చూడాలి.