బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. నిరుద్యోగుల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్కకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతిచ్చారు కూడా.
బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. నిరుద్యోగుల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్కకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతిచ్చారు కూడా. దీంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచిందీ సోషల్ మీడియా సెన్సేషన్. తాజాగా ఓ వీడియోను షేర్ చేసిన శిరీష.. అందులో కన్నీరు పెట్టుకుంటూ కనిపించింది. తాను ఏ తప్పు చేయలేదంటూ భోరుమని ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు బర్రెలెక్కకు ఏమైంది? అని ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కన్నడకు చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్.. బర్రెలక్క తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిందని వార్తలను టెలికాస్ట్ చేసిందట. అందులో తన ఫొటోలతో పాటు, పేరు కూడా ప్రస్తావించారట. పైగా బాధితుడు కూడా తనను బర్రెలక్క మోసం చేసిందని చెప్పాడట. ఈ విషయం తెలుసుకున్న శిరీష నిర్ఘాంతపోయిందట. ఇలా తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు రావడంపై ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.
ఇప్పుడే ఒక వార్తను చూశాను. ఇది ఏ ఛానెలో కూడా నాకు అసలు తెలియదు. కానీ ఏదో కన్నడ ఛానెల్ అని తెలుస్తుంది. ఇలాంటి తప్పుడు, అసత్య వార్తలను ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఫేస్‌బుక్‌లో చాట్ చేసి డబ్బులు దోచుకుందని వార్తలు ప్రసారం చేస్తున్నారు. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఆయనెవరో ముసలాయన అట. ఆయనెవరో కూడా నాకు తెలియదు. కొందరు కావాలనే ఇలా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు. నా పేరు మీద ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. అందులో ఎవరు ఇలాంటి పని చేశారో నాకు తెలియదు. నేనేం తప్పు చేయలేదు’ అంటూ భోరుమంది బర్రెలక్క.