నెలకు రూ.60 వేల జీతంతో స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేదు

నెలకు రూ.60 వేల జీతంతో స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేదు

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ (SVMU) ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్‌మేంట్ యూనిట్ (SVMU) ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల పని అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు జనవరి 01, 2025 నాటికి 40 ఏళ్లకు మించకూడదు.

విద్యార్హతలతోపాటు ఆర్గనైజేషనల్‌ స్కిల్స్ కూడా ఉండాలి. ఎమ్‌ఎస్‌ ఆఫీస్‌ , డిజిటల్‌ కమ్యునికేషన్‌ టూల్స్‌లో అవగాహన ఉండాలి. ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో మాట్లాడటం, రాయడంలో పట్టు ఉండాలి. లీడర్‌షిప్‌, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు సెప్టెంబర్‌ 28, 2024వ తేదీని (సాయంత్రం 5 గంటలలోపు) తుది గడువుగా నిర్ణయించారు. విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.60,000 జీతంగా చెల్లిస్తారు. ఉద్యోగం పొందిన వారు విజయవాడలో పనిచేయవల్సి ఉంటుంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు