పింఛన్‌దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

పింఛన్‌దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్‌దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్‌ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు పింఛన్‌ రూ.6 వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జులై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తాం. ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం.

పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడనుంది. నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్‌ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది. ఎన్నికల సమయంలో 3 నెలలు మీ కష్టాలు చూసి చలించిపోయాను. మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశా. ఏప్రిల్‌ నెల నుంచే పింఛన్‌ పెంపును వర్తింపజేస్తానని మాట ఇచ్చా. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకూ పెంపును వర్తింపచేసి మీకు అందిస్తున్నాం’’ అని లేఖలో సీఎం పేర్కొన్నారు.

               
         
 
            
   
Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు