ఆంధ్రప్రదేశ్‌లోని పలు యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (జులై 18) నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలపడంతో దాదాపు 17 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమించేందుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా ఆరోగ్య యూనివర్సిటీ వీసీ బాబ్జీ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అనంతరం డీఎంఈ నరసింహంకు వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్‌వీయూ ఇన్‌ఛార్జ్ వీసీగా చిప్పాడ అప్పారావు, ఎస్‌కేయూ ఇన్‌ఛార్జి వీసీగా బి అనితలను నియమించారు. నియమితులయ్యారు.
ఏయే యూవర్సిటీలకు ఎవరెవరిని నియమించారలో ఆ వివరాలు ఇవే..
ఆంధ్రా యూనివర్సిటీ – గొట్టపు శశిభూషణ్‌రావు
నాగార్జున యూనివర్సిటీ – కంచర్ల గంగాధర్
జేఎన్‌టీయూ అనంతపురం – సుదర్శన్‌రావు
పద్మావతి మహిళా యూనివర్సిటీ – వి ఉమ
జేఎన్‌టీయూ విజయనగరం – రాజ్యలక్ష్మి
జేఎన్‌టీయూ కాకినాడ – మురళీ కృష్ణ
నన్నయ యూనివర్సిటీ – వై శ్రీనివాసరావు
విక్రమ సింహపురి యూనివర్సిటీ – సారంగం విజయభాస్కర్‌రావు
కృష్ణా యూనివర్సిటీ – ఆర్ శ్రీనివాస్‌రావు
రాయలసీమ యూనివర్సిటీ – ఎన్‌టీకే నాయక్
ద్రవిడ యూనివర్సిటీ – ఎం దొరస్వామి
ఆర్కిటెక్చర్, పైన్ ఆర్ట్స్ వర్సిటీ – విశ్వనాథకుమార్
ఆంధ్రకేసరి యూనివర్సిటీ (ఒంగోలు) – డీవీఆర్ మూర్తి
అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ – పఠాన్ షేక్ ఖాన్