ఏపీలో సూపర్ సిక్స్ కింద ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పథకాలవారీగా విధివిధానాలు, మార్గ దర్శకాలు
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు తీపికబురు
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
ఈ పథకంపై కసరత్తు చేస్తోన్నప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్ల పెంపు అమలు చేయగా.. అన్న క్యాంటీన్లను ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నారు. అయితే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టారు. ముందుగా ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు.. ఇప్పటికే దీనిపై కొందరు మంత్రులు ప్రకటన కూడా చేశారు. అలాగే ఆడబిడ్డ నిధికి సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఈ హామీలతో పాటుగా మహిళలకు ఇచ్చిన మరో హామీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను రూపొందించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు.. వీటిలో దీపం పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం వర్తించదని తెలుస్తోంది. విద్యుత్ బిల్, ఆధార్‌తో లింకైన ఫోన్ నంబర్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అర్హులను గుర్తిస్తారని చెబుతున్నారు. ఈ పథాకానికి సంబంధించిన అర్హతలు, మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ మూడు సిలిండర్లపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను అదించడం లేదని.. 2016 నుంచి 24 వరకూ ప్రధాన మంత్రి ఉజ్వల యువజనం పథకం కింద కొంత మందికి ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పీఎంయూఐ పథకం కింద మొదటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్, సిలిండర్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లకు కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే వివిధ శాఖలతో చర్చించి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని.. సభా ముఖంగా మరోసారి వివరాలు తెలియజేస్తామన్నారు.
సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి హామీలిచ్చారు. అయితే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్నారు. ఏపీ ఎన్నికల కంటే ఏడాది ముందుగానే హామీ ఇచ్చారు. . సూపర్ సిక్స్ పథకాల్లో ఇది కూడా ముఖ్యమైన హామీ. దీంతో ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చే పనిలో పడింది. ఇప్పుడు ఆదిశగా కసరత్తు మొదలు పెట్టింది. ప్రభుత్వం త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.