ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న..

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న..

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం (నేటి) నుంచి ఏసీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయ. సమావేశాల తొలిరోజే 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు శాసనసభ లో సుమారు 2.90 లక్షల అంచనాల ప్రతిపాదనలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్.

వ్యవసాయ శాఖ బడ్జెట్‌ను ప్రత్యేకంగా అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించనున్నారు. ఇక శాసనమండలిలో రెగ్యులర్ బడ్జెట్ ను కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ మండలి ముందు ఉంచనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ ఏడాది ఫిబ్రవరి లో రూ.2,86,389.72 కోట్లకు ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రతిపాదించిన అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.

మొదటి నాలుగు నెలలకు ఏప్రిల్ నుంచి జులై వరకు 1,09,052.34 లకు ఆమోదం లభించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆగస్టు నుంచి నవంబరు వరకు మరో రూ.1,29,972.97 కోట్లకు ఆమోదం పొందించి. ఇక రెండు విడతలుగా నవంబరు నెలాఖరు వరకు 8 నెలల కాలానికి మొత్తం రూ.2,39,025.31 కోట్లకు ఆమోదం లభించింది. మొదటి ఆరు నెలల్లోనే వినియోగం 1,27,637.19 కోట్లుగా ఉంది. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్లో ఏడాదికి రెవెన్యూ రాబడి రూ.2.05 లక్షల కోట్లని ఆశిస్తే తొలి ఆరునెలల్లో వచ్చింది రూ.68,463 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. దీంతో రావల్సిన రెవెన్యూ తో పాటు మార్చి వరకు అంచనాల ఖర్చు ను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఆర్థిక శాఖ.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు