నేడు సూపర్‌-8లో భారత్‌ తొలి మ్యాచ్‌.. అఫ్గానిస్తాన్‌తో కీలక పోరు! జడేజాపై వేటు

నేడు సూపర్‌-8లో భారత్‌ తొలి మ్యాచ్‌.. అఫ్గానిస్తాన్‌తో కీలక పోరు! జడేజాపై వేటు

అఫ్గానిస్తాన్‌తో భారత్‌ ఢీ
రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం
జడేజాపై వేటు

టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ కీలక సమరానికి సిద్ధమైంది. గురువారం తన తొలి సూపర్‌-8 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను టీమిండియా ఢీకొట్టనుంది. గ్రూప్‌ దశ ఫామ్‌ను భారత్ కొనసాగించి.. సూపర్‌-8లో శుభారంభం చేయాలని చూస్తోంది. అయితే అఫ్గాన్‌తో మ్యాచ్‌ అంటే విజయం నల్లేరుపై నడకే అనుకుంటాం. అఫ్ఘనులను తేలిగ్గా తీసుకుంటే ఏమవుతుందో న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో మనం చూశాం. కివీస్‌ లాంటి పెద్ద జట్టును 84 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ సేన జాగ్రత్తగా ఆడాల్సిందే. బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా భారత్‌, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం అవుతుంది.

గ్రూప్‌ దశలో భారత్ విజయాలు సాధించినా విరాట్ కోహ్లీ వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది. 1, 4, 0 గ్రూప్‌ దశలో విరాట్ స్కోర్లు ఇవి. దాంతో కీలక సూపర్‌-8లో విరాట్‌ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్‌ శర్మతో కలిసి విరాట్ ఎలాంటి ఆరంభం అందిస్తాడన్న దానిపైనే మ్యాచ్‌ గమనం ఆధారపడి ఉంటుంది. రిషబ్ పంత్, సూర్యకుమార్‌లు ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. మిడిలార్డర్లో దూబె, హార్దిక్‌ కీలకం. అక్షర్ రాణిస్తున్నా.. జడేజా ఇప్పటివరకు ప్రభావం చూపలేదు. దాంతో కాబట్టి స్పెషలిస్టు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ను ఆడిస్తే జట్టుకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేస్‌ ద్వయం బుమ్రా, అర్ష్‌దీప్‌లపై భారీ అంచనాలున్నాయి. సిరాజ్‌ ఫామ్ అందుకంటే టీమిండియాకు ఎదురుండదు.

ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, నైబ్‌ బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు. ముఖ్యంగా నైబ్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఫారూఖీ, నవీనుల్, రషీద్‌ ఖాన్, నూర్‌ అహ్మద్‌లు బౌలింగ్‌లో రెచ్చిపోతున్నారు. అజ్మతుల్లా, నబి, కరీమ్‌ లాంటి ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తే.. రషీద్, నబి, నూర్‌లు రెచ్చిపోతారు. కాబట్టి భారత్ జాగ్రతగా ఆడాల్సిందే.

తుది జట్లు (అంచనా):

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబె, హార్దిక్, జడేజా/కుల్‌దీప్, అక్షర్, అర్ష్‌దీప్, బుమ్రా, సిరాజ్‌.

అఫ్గానిస్థాన్‌: గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, నైబ్, అజ్మతుల్లా, నజీబుల్లా, నబి, కరీమ్‌ జనత్, రషీద్‌ ఖాన్‌ (కెప్టెన్‌), నూర్‌ అహ్మద్, నవీనుల్, ఫారూఖీ.

Please follow and like us:
క్రీడలు వార్తలు