ఈ దాడిపై ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌కు చెందిన ఒక ఆఫ్గన్ అనుబంధ సంస్థ 2021 ఆగస్టులో తాలిబన్ అధికారం చేపట్టినప్పటి నుండి హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది. ఐసిస్ ప్రత్యేకించి ఆఫ్గనిస్తాన్‌లోని షియా ముస్లిం మైనారిటీని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేసింది.
ఆఫ్గనిస్తాన్‌లోని ఓ పాఠశాలపై చేసిన బాంబు దాడిలో 15 మంది విద్యార్థులు మరణించగా 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం జరిగిన ఈ దాడిని అంతర్గత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ నాఫి టాకోర్ అధికారికంగా ధ్రువీకరించారు. ఉత్తర సమంగాన్ ప్రావిన్స్ రాజధాని అయ్బక్‌లోని మదర్సాలో ఈ పేలుడు సంభవించిందని, మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు జరిగినట్లు ఆఫ్గనిస్తాన్ టోలో వార్తా సంస్థ పేర్కొంది.
అయితే ఈ దాడిపై ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌కు చెందిన ఒక ఆఫ్గన్ అనుబంధ సంస్థ 2021 ఆగస్టులో తాలిబన్ అధికారం చేపట్టినప్పటి నుండి హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది. ఐసిస్ ప్రత్యేకించి ఆఫ్గనిస్తాన్‌లోని షియా ముస్లిం మైనారిటీని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేసింది. అయితే సున్నీ మసీదులు, మదర్సాలు.. ముఖ్యంగా తాలిబన్‌తో అనుబంధమై ఉన్న వాటిని కూడా లక్ష్యంగా చేసుకుంది. తాలిబాన్, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ రెండూ ఒక రకమైన ఉగ్రవాద సంస్థలు అయినప్పటికీ.. ఇవి రెండూ బద్ధ శత్రువులుగా ఉండడం గమనార్హం.