జూన్ 27న విడుదలైన ఈ సినిమా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రస్తుతం రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఇప్పటికీ పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. ప్రస్తుతం 44 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి గురించి ప్రశ్నిస్తే మాత్రం నవ్వి సైలెంట్ అయిపోతుంటారు.
నా ఫస్ట్ క్రష్ ఆమెనే.. తెగ సిగ్గుపడిపోయిన ప్రభాస్.. వీడియో వైరల్.. అయ్యా బాబోయ్.. ఫస్ట్ క్రష్ గురించి చెబుతూ సిగ్గుపడిపోయిన ప్రభాస్.. డార్లింగ్ మనసు దొచుకుంది తనే.. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రభాస్. వరుసగా రికార్డ్స్ కొల్లగొడుతున్న బాక్సాఫీస్ కింగ్ డార్లింగ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సినిమాల మీద సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. బాహుబలి సినిమా తర్వాత వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా స్థాయి సినిమాలతో రికార్డ్స్ సృష్టిస్తున్నారు. రాధేశ్యామ్, ఆదిపురుష్, సాహో సినిమాలతో అభిమానులను నిరాశ పరిచిన ప్రభాస్.. సలార్ సినిమాతో ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ఇక ఇటీవలే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రస్తుతం రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఇప్పటికీ పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. ప్రస్తుతం 44 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి గురించి ప్రశ్నిస్తే మాత్రం నవ్వి సైలెంట్ అయిపోతుంటారు.
అయితే ప్రభాస్ పెళ్లి సమయం వచ్చినప్పుడు కచ్చితంగా జరుగుతుందంటూ డార్లింగ్ పెద్దమ్మ శ్యామలా దేవి పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. కానీ ప్రభాస్ పెళ్లి గురించి అడియన్స్, ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఎప్పుడూ పెళ్లి ప్రకటన చేస్తారు ? అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఎప్పుడూ ఎక్కడా తన గురించి ఎక్కువగా మాట్లాడని ప్రభాస్ మొదటిసారి తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో తన ఫస్ట్ క్రష్ గురించి చెబుతూ సిగ్గుపడిపోతున్నాడు ప్రభాస్.
ఒక తమిళ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తన ఫస్ట్ క్రష్ ఎవరో రివీల్ చేశాడు. మీ ఫస్ట్ క్రష్ ఎవరు ?.. స్కూల్లోనా లేదా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ? అని యాంకర్ అడగ్గా.. స్కూల్లోనే అంటూ ఆన్సర్ ఇచ్చారు ప్రభాస్. అయితే ఆ అమ్మాయి పేరు ఏంటీ అని అడిగితే గుర్తులేదు.. మర్చిపోయాను అంటూ నవ్వుకున్నారు. ఏ క్లాస్ లో ఉన్నప్పుడు అని అడిగేసరికి క్లాస్ మెట్ కాదు.. టీచరే నా ఫస్ట్ క్రష్.. నేను చదివింది కూడా ఇక్కడే చెన్నైలో .. ఆ టీచర్ చాలా బాగుండేది అంటూ చెప్పుకొచ్చారు ప్రభాస్. అయితే ఫస్ట్ క్రష్ గురించి అడగ్గానే ప్రభాస్ సిగ్గు పడుతూ, నవ్వుతూ ఆన్సర్ ఇచ్చిన వీడియో ఇప్పుడు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ప్రభాస్ ఫేస్ లో బ్లషింగ్, ఎంత ముద్దుగా చెబుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.