అతివేగం ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టిందో కారు. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు స్పాట్‌లో చనిపోయారు. లారీ -కారు మధ్యలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 5 సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో కారు నడుపుతూ, ఎదురుగా వస్తున్న కెమికల్ లారీని బలంగా ఢీ కొట్టింది. నిర్లక్ష్యం గా కార్ డ్రైవ్ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీ ని ఢీ కొట్టారు. దీంతో ముగ్గురు విద్యార్థులు స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు. మృతులను VNR విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన ఆకాష్, హరి, అస్మిత్‌లుగా గుర్తించారు. కాగా, ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఇద్దరినీ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణంగా భావిస్తూ, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దుండిగల్ పోలీసులు తెలిపారు.