ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం (జూన్ 18) విడుదల కానున్నాయి. తొలుత ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు, ఆ తర్వాత ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను..
అమరావతి, జూన్ 18: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం (జూన్ 18) విడుదల కానున్నాయి. తొలుత ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు, ఆ తర్వాత ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితియ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
ఈ ఏడాది ఇంటర్మిడియెట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను ఇంటర్ బోర్డు తొలిసారిగా డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసింది. ఆ రోజు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తారు. అనంతరం ఈ నెల 26న ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
కాగా ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఏప్రిల్ 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్ల ఫెయిలైన విద్యార్ధులు మే 24 నుంచి జూన్ 1వ తేదీన వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు తొలుత ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేయనున్నారు. మరో వారం తర్వాత ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు వెలువడనున్నాయి.