కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజమెంత? నిర్మాణ సంస్థలపై ఉన్న ఒత్తిడి ఏంటి? దీనిపై అఫిడవిట్ రూపంలో వివరాలు ఇవ్వాలని అంటోంది జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్. తప్పుడు వివరాలు ఇస్తే తెలిసిపోతుందంటున్న కమిషన్.. నిజంగా తప్పుడు సమచారం ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పినాక్ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా కమిషన్ ముందు కన్స్ట్రక్షన్ కంపెనీలు L అండ్ T, నవయుగ, ఆఫ్కాన్ హాజరయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజమెంత? నిర్మాణ సంస్థలపై ఉన్న ఒత్తిడి ఏంటి? దీనిపై అఫిడవిట్ రూపంలో వివరాలు ఇవ్వాలని అంటోంది జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్. తప్పుడు వివరాలు ఇస్తే తెలిసిపోతుందంటున్న కమిషన్.. నిజంగా తప్పుడు సమచారం ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పినాక్ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా కమిషన్ ముందు కన్స్ట్రక్షన్ కంపెనీలు L అండ్ T, నవయుగ, ఆఫ్కాన్ హాజరయ్యాయి. ఆరోపణలపై కమిషన్ వివరణ కోరగా నిర్దిష్ట సమయంలో నిర్మాణం పూర్తి చేయాలని తమకు టైం బౌం పెట్టారని చెప్పాయి నిర్మాణ సంస్థలు. అయితే ఇదే విషయం అఫిడవిట్ రూపంలో సమర్పించాలని కమిషన్ సూచించింది. కన్స్ట్రక్షన్ కంపెనీలతో విచారణ ముగిసిన అనంతరం జస్టిస్ చంద్రఘోష్ కొన్ని కీలక విషయాలు వివరించారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునేందుకే అఫిడవిట్ ఫైల్ చేయాలని కన్స్ట్రక్షన్ ఏజెన్సీలకు సూచించినట్లు ప్రకటించారు. తమకు టైం బౌండ్ పెట్టారని నిర్మాణం కంపెనీలు చెప్తున్నాయి. ప్రభుత్వం విధించిన సమయంలో ప్రాజెక్టు పూర్తిచేసి అందించామని అంటున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణం, డిజైన్, మెయింటేనెన్స్ గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. కమిషన్ ముందు ఎవరు ఏం చెప్పినా.. ప్రతీది రికార్డు రూపంలో ఉండాలన్నారు. నెలాఖరులోపు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని ఆదేశించామన్నారు.
ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వారిని కూడా విచారణకు పిలుస్తామన్నారు. సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పామన్నారు. మరోవైపు ఇప్పటి వరకు విచారణకు వచ్చిన వారు ఇచ్చిన వివరాలు ఆధారంగా ఇతర వ్యక్తులను కూడా విచారిస్తామన్నారు. కొంతమంది అధికారులు రాష్ట్రంలో లేరు, వాళ్లను కూడా విచారిస్తామని ప్రకటించారు జస్టిస్ చంద్రఘోష్. విజిలెన్స్, కాగ్ రిపోర్టులు ఆధారంగా సంబంధిత అధికారుల నుంచి వివరాలు సేకరిస్తామన్నారు. అఫిడవిట్లో తప్పులు నమోదు చేస్తే తమకు తెలిసిపోతుందన్నారు జస్టిస్ చంద్రఘోష్. న్యాయ విచారణ కమిషన్ ముందు L&T, నవయుగ, ఆప్కాన్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఒక్కో సంస్థ నుంచి ముగ్గురు ప్రతినిధులు బ్యారేజీలకు సంబంధించిన వివరాలతో కమిషన్ ముందుకు వచ్చారు. బ్యారేజీల ఖర్చులు, పెరిగిన అంచనాలు, ఇతర అంశాలపై వివరాలు సేకరిస్తోంది కమిషన్. గడిచిన రెండు రోజులుగా 25 మంది అధికారులను విచారించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్.. ఈ నెల 25 లోపు అఫిడవిట్ సమర్పించాలని విచారణలో పాల్గొన్న అధికారులకు సూచించింది. తప్పుడు సమాచారంతో విచారణను తప్పుదోవ పట్టించాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులను హెచ్చరించింది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో నిర్మాణ కంపెనీలు, అధికారులు, సంబంధిత వ్యక్తుల నుంచి అన్ని వివరాలు సేకరిస్తోంది కమిషన్.