వేంకటేశ్వరుడే నన్ను బతికించాడు.. 4.0 ఇప్పుడు ఎలా ఉండబోతుందో మీరే చూస్తారు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

వేంకటేశ్వరుడే నన్ను బతికించాడు.. 4.0 ఇప్పుడు ఎలా ఉండబోతుందో మీరే చూస్తారు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక తీర్పును ప్రజలు తమకు ఇచ్చారన్నారు. నిన్న ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‎కు దేశంలోని ప్రముఖులు హాజరవ్వడం చాల సంతోషంగా ఉందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం తరువాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తరువాత చేపట్టిన తొలి ప్రెస్ మీట్ ఇది. ఈ సందర్భంగా అనేక విషయాలను పంచుకున్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి తన కులదైవమని చెప్పారు.

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక తీర్పును ప్రజలు తమకు ఇచ్చారన్నారు. నిన్న ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‎కు దేశంలోని ప్రముఖులు హాజరవ్వడం చాల సంతోషంగా ఉందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం తరువాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తరువాత చేపట్టిన తొలి ప్రెస్ మీట్ ఇది. ఈ సందర్భంగా అనేక విషయాలను పంచుకున్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి తన కులదైవమని చెప్పారు. తాను ఏ పని సంకల్పించినా ఒక్క నిమిషం ఆ స్వామిని తలుచుకునే కార్యక్రమం చేపడతానన్నారు. తాను చదువుకునే రోజుల్లో తిరుమలకు నడుచుకుంటూ వచ్చేవాళ్లమని పాత రోజులు గుర్తు చేశారు. వెంకటేశ్వరస్వామి ఆశీసులతో అంచెలంచెలుగా ఎదిగానన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పిచేందుకు తిరుమల చేరుకునే సమయంలో ఘాట్ రోడ్డులో బాంబుదాడులు జరిగిన అంశాన్ని ప్రస్తావించారు. ఆ ఘటనలో తనను వెంకటేశ్వరస్వామి బ్రతికించారని కీర్తించారు.

ఈ రాష్ట్రానికి, ఈ జాతికి మరింత సేవ చేయాల్సి ఉందని తనను ప్రాణాలతో బ్రతికించారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నదే తన లక్ష్యం అన్నారు. భారతదేశంలో ఆంధ్రరాష్ట్రం అత్యున్నత స్థానంలో ఉండాలన్నదే తన ధ్యేయమన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో.. సృష్టించిన సంపద ప్రతి పేదవాడికి చేరవేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తానన్నారు. పేదరికం లేని దేశం తద్వారా పేదరికం లేని రాష్ట్రాన్ని తీసుకురావాలన్న స్పూర్తితో పనిచేస్తానన్నారు. ఉదయాన్ని లేచిన వెంటనే వెంకటేశ్వరస్వామిని ఈ అంశాలపై ధ్యానం చేస్తానని వివరించారు. తిరుమలకు వస్తే వైకుంఠానికి వచ్చిన అనుభూతి కలుగుతుందని.. ఇక్కడ ఓం నమో నారాయణాయ మంత్రం తప్ప ఇంకేమీ వినిపించకూడదన్నారు. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదన్నారు. గత ఐదేళ్లలో తిరుమలను అధ్వాన్నంగా మార్చారని విమర్శించారు. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పుతూ.. పెళ్లి, పేరంటాలకు తీసుకెళ్లారన్నారు. ఇకపై తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తిరుమల కొండపై నాన్ వెజ్ తీసుకొచ్చారని ఆరోపించారు. నేటి నుంచి ప్రజాపాలన మొదలైందని చెప్పారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు