డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జూన్ 08వ తేదీన జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ కొట్టింది. మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకను 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులకు కట్టడి చేసింది. బంగ్లా బౌలర్లలో పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ రిషాద్‌కు 3/17, తస్కిన్ అహ్మద్ 2/25 వికెట్లు తీశారు.
శ్రీలంక తరఫున ఓపెనర్ పాతుమ్ నిస్సాంక 28 బంతుల్లో 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఛేజింగ్‌లో తౌహిద్ 20 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి 40 పరుగులు చేశాడు.
అతనికి తోడుగా మహ్మదుల్లా తన 13 బంతుల్లో-16 పరగులు చేసి నాటౌట్ నిలిచి జట్టును విజయతీరాలకు నడిపించాడు. ఇది శ్రీలంకకు రెండో ఓటమి. గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లు రెండేసి పాయింట్లు కలిగి ఉండగా, నేపాల్, శ్రీలంక జట్లు మాత్రం ఇంకా ఖాతా తెరవలేదు.