వ్యక్తిగా తనను తాను మార్చుకున్న చిత్రమే ‘లవ్ మౌళి’ అని చెప్పాడు నవదీప్. ఆయన హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నవదీప్ చెప్పిన విశేషాలు.‘‘ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ అన్ని తరహా పాత్రలు చేశా. అయినా నా నుంచి ప్రేక్షకులు ఏదో కొత్తగా ఆశిస్తున్నారు అనిపించింది. అలాంటి సమయంలోనే ఈ కథ విన్నా. దీనికోసం కంప్లీట్‌గా నన్ను నేను మార్చుకున్నా.
రెండున్నర సంవత్సరాలుగా అదే గెటప్‌లో ఉన్నా. నా తపనను నా స్నేహితులు కూడా అర్థం చేసుకుని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ షూటింగ్ మొత్తం మేఘాలయాలోని చిరపుంజీలో చేయడం పెద్ద సాహసం అని చెప్పాలి. అక్కడ ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది. అలాంటి లొకేషన్లో షూట్ మొత్తం కంప్లీట్ చేసిన ఫస్ట్ సినిమా ఇది. రెగ్యులర్ లవ్‌స్టోరీ కాదు. ఏ విషయంలోనూ రొటీన్‌గా ఉండదు. ముఖ్యంగా యూత్‌కు కచ్చితంగా కనెక్ట్ అవుతుంది.
ప్రేమలో ఉన్న మనిషికి నిజమైన ప్రేమ గురించి వెతికే పాత్ర నాది. నా పాత్రలో డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని చూసి పంఖురి అద్వానీని సెలక్ట్ చేశాం. ఓసారి సరదాగా హీరో రానాకు ఈ కథ చెప్పా. కథ బాగుందని చెప్పి తను అఘోరాగా ముఖ్య పాత్రను చేశాడు. అలాగే ఇందులో సాంగ్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఫైనల్‌గా సినిమా ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ఈ సినిమా విజయంతో నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నా”