తెలంగాణ గురుకులాల్లో 616 పోస్టుల ఉద్యోగాల భర్తీ కోసం 2017లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అదే ఏడాది సెప్టెంబర్లో పరీక్షను నిర్వహించారు. ఫలితాలను 18 మే 2018లో విడుదల చేశారు. ఇందులో మొత్తం 1200 మందిని సెలెక్ట్ చేసి వెరిఫికేషన్ చేసే క్రమంలో కొందరు అభ్యర్థులు డీఈడీ చేసిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్ట్ కేసు కారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది.
అర్హత విషయంలో గందరగోళం
కోర్ట్లో ఈ కేసు క్లియర్ అయినా తర్వాత కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా అనేక కారణాలు చూపుతూ పోస్టింగ్ ఇవ్వకుండా తన వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విద్య శాఖకు లేఖలు రాసి నియామక ప్రక్రియ విధానం జరగకుండా పలుమార్లు అడ్డుకున్నారని తెలంగాణ అన్ ఎంప్లాయ్ & ప్రైవేట్ ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ నాయకులూ ఆరోపించారు. వాస్తవానికి విద్య శాఖ అధికారులు పీఈటీ పోస్ట్ రాష్టంలో 6వ తరగతి నుంచి మాత్రమే వుంటుందనే విషయాన్ని పలుమార్లు కోర్ట్ దృష్టికి తెచ్చిన.. 5వ తరగతికి ప్రత్యేకించి పోస్ట్ లేదని చెప్పినా అప్పటి చైర్మన్ జనార్ధన్ రెడ్డి ఐదవతరగతికి కుడా కొన్ని పోస్ట్లు కేటాయించాలని నియామక ప్రక్రియను అడ్డుకున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
ఐదు మంది అభ్యర్థులు బలి:
కమిషన్ చేసిన నిర్వాహకముతో అర్హత సాధించి కూడా ఉద్యోగాలు రాలేదనే మనోవేదనతో ఐదుగురు అభ్యర్థులు చనిపోయారని అసోసియేషన్ నాయకులు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికీ 60 సార్లు టీఎస్పీఎస్సీని ముట్టడించామని అభ్యర్థులు తెలిపారు. అలాగే ప్రగతి భవన్2ను కుడా పలుమార్లు ముట్టడించారు. అయినా ఎలాంటి ఫలితం.. నిర్ణయం కానీ ప్రభుత్వం తీసుకోలేదు.
ఇకనైనా నియామకాలు చేపట్టండి:
కోర్ట్ క్లియరెన్స్ ఇచ్చిన కమిషన్ పట్టించుకోవడం లేదని.. ఇప్పటికి ఏళ్ళు పూర్తవుతుందని ఇంకా ఏన్నాళ్లు వేచి చూడాలని అర్హత పొందిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కొత్త ప్రభుత్వం నియామకాలు చేపట్టాలని తెలంగాణ అన్ ఎంప్లాయ్, ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాడగోని సైదులు గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గాంధీ భవన్లో మా సమస్యల గూర్చి రేవంత్ రెడ్డికి విన్నవించామని.. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని అందుకే ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాలనీ సైదులు గౌడ్ డిమాండ్ చేశారు.