ఛాన్స్ లు వచ్చిన ప్రతీసారి రాణిస్తున్న సంజూ శాంసన్ ని పక్కనబెట్టి, గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రిషబ్ పంత్ ని న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో ఆడించారు. ఈ విషయంలో సంజూ ఫాన్స్ తో పాటు, భారత మాజీ ఆటగాళ్లు, క్రికెట్ ఎక్స్ పర్ట్స్ బీసీసీఐ సెలక్షన్ కమిటీపై విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ధవన్ మీడియా సమావేశంలో స్పష్టత ఇచ్చారు.
‘పంత్ మ్యాచ్ విన్నర్. భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అందుకే జట్టులో ఇంకా ఉన్నాడు. సంజూ శాంసన్ కూడా గొప్ప ప్లేయర్. తన స్థాయికి తగ్గ ఆట ఆడుతున్నాడు. మంచిగా రాణిస్తున్నాడు కూడా. కాకపోతే పంత్ గణాంకాలు శాంసన్ కన్నా మెరుగ్గా ఉన్నాయి. అవే టీం సెలక్టర్లకు పంత్ పై విశ్వాసాన్ని ఇంకా ఉంచుతున్నాయి. ప్లేయర్లు సరిగా ఆడలేనప్పుడు సెలక్టర్ల తరపున కొంత ప్రోత్సాహం అందించాలి. అప్పుడే తిరిగి గాడిన పడగలరు. ఈ విషయంలో సంజూ ఇంకొంత కాలం వేచి చూడాల్సి రావచ్చు’ అని అన్నాడు. అయితే, వైట్-బాల్ ఫార్మాట్లో చివరి తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో పంత్ స్కోర్ చేసింది 10, 15, 11, 6, 6, 3, 9, 9, 27 మాత్రమే.