పుష్ప-2 టికెట్‌ ధర ఎంతో తెలుసా.? టికెట్‌ ధర రూ.800లుగా ఖరారు..

పుష్ప-2 టికెట్‌ ధర ఎంతో తెలుసా.? టికెట్‌ ధర రూ.800లుగా ఖరారు..

డిసెంబ‌ర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోల‌తో పాటు అర్ధరాత్రి 1 షోల‌కు అనుమతినిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సింగిల్ థియేట‌ర్‌ల‌లో, మల్టీఫ్లెక్స్‌ల్లో ఈ బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800గా ఖరారు చేసింది. మ‌రోవైపు అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఎక్స్‌ట్రా షోలకు అనుమతినిచ్చింది. డిసెంబ‌ర్ 05 నుంచి 08 వ‌ర‌కు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచింది. అలాగే.. డిసెంబ‌ర్ 09 నుంచి 16 వరకు సింగిల్ థియేట‌ర్‌ల‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతిని ఇచ్చింది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ థియేట‌ర్‌ల‌లో రూ.20 మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దాదాపు 18 రోజులు ఈ పెంచిన రేట్లు అమ‌లులో ఉండ‌నున్నట్లు వెల్లడించింది. ఇక తెలంగాణ అడ్వాన్స్‌కు బుకింగ్‌కు సంబంధించి నేడు సాయంత్రం 4.56 గంట‌ల నుంచి ప్రారంభం కానున్న‌ట్లు చిత్రయూనిట్ వెల్ల‌డించింది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు సినిమా