మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఇస్రో.. ఏకంగా సూర్యుడిపై అధ్యయనం కోసం..!

మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఇస్రో.. ఏకంగా సూర్యుడిపై అధ్యయనం కోసం..!

ఈ ప్రోబా..3 ఆకాశంలో కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు, సూర్యుని బాహ్య వలయం కరోనాని అధ్యయనం చేసేందుకు యూరోపియన్ ప్రయోగాన్ని తలపెట్టింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భారత్‌కు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటడ్(NSIL) సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా యూరోపియన్ ఏజెన్సీ కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఇస్రో శ్రీహరికోట నుండి డిసెంబర్ నాలుగవ తేదీ సాయంత్రం నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించనున్నారు.

తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం నాలుగు గంటల 8 నిమిషాలకు శ్రీహరికోట నుండి పీఎస్ఎల్వీ సి-59 వాహక నౌక ద్వారా భూమి నుండి 60 వేల కిలోమీటర్లు ఎత్తులో భూ ఆకర్షణ శక్తి తక్కువగా ఉన్న కక్షలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రోబా..3 సాటిలైట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనన్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ డిసెంబర్ మూడవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల 38 నిమిషాలకు శ్రీహరికోటలోని మొదటి రాకెట్ ప్రయోగ వేదిక నుండి కౌంట్ డౌన్ ప్రక్రియను మొదలుపెట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ 25 గంటల 30 నిమిషాల పాటు కొనసాగిన పిమ్మట డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం నాలుగు గంటల 8 నిమిషాలకు పిఎస్ఎల్వీ-సి59 రాకెట్ ద్వారా ప్రోబా..3 సాటిలైట్లు నిర్దేశించిన కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం ద్వారా యూరోపియన్ దేశానికి చెందిన రెండు ఉపగ్రహాలను ఈ ప్రోబా..3 ఉపగ్రహంలో అమర్చి నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇందులో ఒకటి ఓకల్టర్ సాటిలైట్ మరొకటి కరోనా గ్రాఫ్ శాటిలైట్ అనే ఈ రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ pslv-c59 రాకెట్ ప్రయోగం ద్వారా భూమి నుండి 30 వేల కిలోమీటర్ల ఎత్తునుండి 60 వేల కిలోమీటర్లు ఎత్తులోని గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉన్న కక్షలోకి ఈ రెండు ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ పిఎస్ఎల్‌వి- సి59 రాకెట్ ప్రయోగం పూర్తిగా విదేశీ రాకెట్ ప్రయోగం. పూర్తి కమర్షియల్ రాకెట్ ప్రయోగం.

అయితే, ఈ ప్రోబా..3 శాటిలైట్ పూర్తిగా సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగిస్తున్న రాకెట్. ఇదిలా ఉండగా ఇస్రో ఇప్పటికే చంద్రయాన్ లాంటి ప్రయోగాలు చేపట్టి చంద్రునిపై ఎన్నో పరిశోధనలు చేసింది. అలాగే సూర్యునిపై పరిశోధనల కోసం ఆదిత్య యల్ వన్ రాకెట్ ప్రయోగం చేపట్టి, సూర్యునిపై కూడా పరిశోధనలు చేపట్టింది. అయితే ప్రస్తుతం ఈ పి ఎస్ ఎల్ వి – సి59 రాకెట్ ప్రయోగం ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన ప్రోబా..3 మన దేశానికి చెందిన పిఎస్ఎల్వి సి 59 రాకెట్ ద్వారా ప్రయోగించడం విషయం.

ఈ ప్రోబా..3 ఆకాశంలో కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు, సూర్యుని బాహ్య వలయం కరోనాని అధ్యయనం చేసేందుకు యూరోపియన్ ప్రయోగాన్ని తలపెట్టింది. ఈ ప్రయోగం ఇస్రోకు సవాలుతో కూడిన సాహసోపేతమైన ప్రయోగం అని, ఈ ప్రయోగం విజయం తర్వాత ఇస్రోకు మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మన దేశానికి చెందిన రాకెట్ల ద్వారా ప్రయోగించే అవకాశం లభిస్తుందని మన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ PSLV-C59 రాకెట్ ప్రయోగం కోసం ఏర్పాట్లు ఇప్పటికే షార్‌లో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు