గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే

గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజులుగా భారీగా తగ్గుతున్నాయి. గోల్డ్ లవర్స్‌కి ఇది నిజంగానే గోల్డెన్ న్యూస్ అండీ..! మరి లేట్ ఎందుకు హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతుందంటే..

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ఆ మధ్య ఆల్‌టైమ్‌ హై రికార్డులతో హోరెత్తించినా.. ఆ తర్వాత వరుసగా క్షీణించాయి. కానీ తిరిగి పరుగులు పెట్టిన గోల్డ్‌ రేట్లు.. ఇప్పుడు పతనం దిశగా సాగుతున్నాయి. వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ. 2410 మేరకు తగ్గింది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గింది. అటు వెండి ధరలు కూడా గత మూడు రోజుల్లో రూ. 2600 మేరకు తగ్గాయి.

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 77వేల 230 రూపాయలు పలుకుతోంది. అలాగే, 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ 70వేల 790గా ఉంది. ఇక, వెండి ధర కూడా తగ్గి.. ప్రస్తుతం కిలో వెండి 97వేల 900 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,380గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 70,940గా ఉంది. అటు ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,230గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 70,790గా కొనసాగుతోంది.

కాగా, ఈ ధరలు బుధవారం ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కోనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్‌ చేసుకోవడం బెటర్‌. ఇక లేటెస్ట్‌ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు