వారెవ్వా.. అదిరింది బాసూ.. మహేష్ న్యూలుక్ చూశారా.. ? రాజమౌళితో కలిసి సెలబ్రేషన్లలో..

వారెవ్వా.. అదిరింది బాసూ.. మహేష్ న్యూలుక్ చూశారా.. ? రాజమౌళితో కలిసి సెలబ్రేషన్లలో..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా లుక్ టెస్టులు, బాడీ పరంగా రెడీ అవుతున్నాడు. అయితే మహేష్ లుక్స్ ఫోటోస్ నెట్టింట నిత్యం వైరలవుతున్నాయి. ఇటీవల కొన్నాళ్లుగా లాంగ్ హెయిర్, పెద్ద గడ్డంతో కనిపించిన మహేష్.. ఇప్పుడు స్టైలీష్ గా మారిపోయారు.

ఈ ఏడాది ప్రారంభంలోనే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు మహేష్. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ పూర్తిగా రాజమౌళి సినిమా కోసం టైమ్ కేటాయించారు. కొన్ని నెలలుగా జక్కన్న రూపొందించే ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల కంటే ఓ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని.. ఈ సినిమాతో మహేష్ క్రేజ్ అంతర్జాతీయంగా మారుమోగుతుందని ముందు నుంచే టాక్ వినిపిస్తుంది. కొన్నాళ్లుగా రాజమౌళి రైటింగ్ పార్ట్ పూర్తి చేసి లొకేషన్స్ వెతికే పనిలో పడ్డారు.

ఇటీవలే కెన్యా నుంచి పలు లొకేషన్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు మహేష్ తన లుక్స్, బాడీ పరంగా సిద్ధమవుతున్నాడు. కొన్ని రోజులుగా మహేష్ లాంగ్ హెయిర్.. గడ్డంతో కనిపించేవాడు. దీంతో జక్కన్న సినిమా కోసమే మహేష్ ఇలా కనిపిస్తున్నాడంటూ ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు మహేష్ న్యూలుక్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు టాలీవుడ్ హీరో శ్రీసింహ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు మహేష్ బాబు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట్లో వైరలయ్యాయి.

అయితే ఇన్నాళ్లు మహేష్ లాంగ్ హెయిర్, గడ్డంతో కనిపించిన మహేష్.. ఈ వేడుకలో మాత్రం గడ్డం తీసేసి హెయిర్ స్టైల్ ఛేంజ్ చేసి మరింత స్టైలీష్ గా కనిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు సూపర్ స్టార్ న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఆ ఫోటోలలో మహేష్ వెనకాలే రాజమౌళి కూడా ఉన్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోయే SSMB 29 అప్డేట్స్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Please follow and like us:
వార్తలు సినిమా