స్కూలు నుంచి ఇంటికి వచ్చిన బాలిక దుస్తులపై రక్తం మరకలు ఉండటంతో తల్లి ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగు చూసింది.
ప్రకాశంజిల్లాలో ఓ ప్రభుత్వం ఉపాధ్యాయుడు బరితెగించాడు. అభం శుభం తెలియని బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. జిల్లా పరిషత్ హైస్కూల్లో 4వ తరగతి చదువుతున్న విద్యార్ధినిపై ఓ టీచర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు వీరపనేని చెన్నకేశవులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై బాధిత బాలిక స్పష్టంగా స్టేట్‌మెంట్ ఇవ్వని కారణంగా కేసు నమోదులో జాప్యం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఎట్టకేలకు బాలిక ఇచ్చిన స్టేట్‌మెంట్ మేరకు నిందితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడైన ఉపాధ్యాయుడు వీరపనేని చెన్నకేశవులను పోలీసులు కోర్టు అదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలు దళితురాలు కావడంతో ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టం కేసును నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశంజిల్లాలో సంచలనం సృష్టించిన నాలుగో తరగతి విద్యార్ధినిపై లైంగిక దాడి విషయంలో ఘటన జరిగిన తరువాత నాటకీయ పరిణామాల మధ్య మూడురోజుల తరువాత పోలీసులు కేసు నమోదు చేశారు. వారం రోజుల తరువాత నిందితుడైన ఉపాధ్యాయుడు వీరపనేని చెన్నకేశవులను అరెస్ట్ చేశారు.
స్కూలు నుంచి ఇంటికి వచ్చిన బాలిక దుస్తులపై రక్తం మరకలు ఉండటంతో తల్లి ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. స్కూల్లో తన స్నేహితురాలు ఓ టీచర్ పిలుస్తున్నాడని తీసుకెళ్ళిందని, అక్కడ ఆ టీచర్ తనపై లైంగికంగా దాడి చేశాడని తల్లికి చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు కుటుంబసభ్యులు. అనంతరం బాలికను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అయితే డాక్టర్లు బాలికను పరీక్షించిన తరువాత తనపై దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందన్నది పోలీసులు విచారిస్తుండగా స్పష్టంగా చెప్పలేకపోయింది. ఈ కారణంగా అదేరోజు పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాలిక భయపడుతుందన్న కారణంగా రెండో రోజు కూడా ఆమె స్టేట్‌మెంట్ తీసుకున్నా, క్లారిటీ లేదన్న కారణంగా మూడు రోజుల వరకు విచారణ ముందుకు సాగలేదు…
మరోవైపు విద్యార్ధినికి బ్లీడింగ్ కావడంతో వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్సకోసం చేరిన విద్యార్ధిని వ్యవహారంలో పోలీసులు ఇంకా క్లారిటీ రాలేదన్న కారణంగా తాత్సారం చేయగా విద్యాశాఖ అధికారులు డిప్యూటీ డిఇఓ చంద్రమౌళి, సర్వశిక్షా అభియాన్ అదికారి మాధవి లత విచారణ చేపట్టారు. ఇటు హైస్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్దులను, అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను విద్యాశాఖ అధికారులు విచారించారు.
ఈ సందర్భంగా తన స్కూలు మేట్‌గా ఉన్న తన స్నేహితురాలు టీచర్ పిలుస్తున్నాడంటూ తీసుకెళ్ళిందని, అక్కడ టీచర్ తన రహస్యాంగాల దగ్గర చెప్పుకోలేని విధంగా వేళ్ళతో గట్టిగా తాకాడని బాలిక విద్యాశాఖ అధికారులకు తెలిపింది. తనపై లైంగికదాడికి పాల్పడ్డ ఉపాధ్యాయుడిని బాలిక గుర్తించింది. దీంతో నిందితుడిగా ఉన్న ఉపాద్యాయుడు వీరపనేని చెన్నకేశవులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇప్పటికే నిందితుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. అయితే బాలిక దళితురాలు కావడంతో అట్రాసిటీతోపాటు అత్యాచార నిరోధక చట్టం ప్రకారం మరో కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.