బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు వస్తాయో తెలుసా? మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు!

బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు వస్తాయో తెలుసా? మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు!

తుఫాన్.. సముద్రంలో ఏర్పడేవిగా మనకు తెలుసు.. వాటి భీభత్సం ఎలా ఉంటుందో కూడా చాలా సందర్భాల్లో చూశాం.. కానీ అవి ఎక్కడ ఏర్పడుతున్నాయి అన్న విషయం ఎప్పుడైనా గమనించారా.. ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.. సుదీర్ఘమైన తూర్పు తీరంలో అక్కడే అల్పపీడనాలు మొదలై ఎక్కడో తీరం దాటుతున్నాయి.. ఏంటది.. మిస్టరీనా?

ఎక్కువగా గాలులు ఉండే ప్రాంతాన్ని అధిక పీడనం అంటారు. అతి తక్కువ గాలులు ఉంటే దాన్ని అల్పపీడనంగా పిలుస్తారు. గాలుల కదలికలో మార్పుల వల్లే ఈ రెండు పీడనాలు ఏర్పడతాయి. గాలుల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. అవి వేడి గాలి, చల్లగాలి.. ఈ గాలులు భూమి మీద, సముద్రాల మీద వ్యాపించి ఉంటాయి. వేడిగాలి తేలికగా ఉండి పైకి చేరుతుంది. చల్లగాలి నీటి తేమ కారణంగా భూ ఉపరితలం మీద ఉంటుంది. సముద్ర ఉపరితలం వేడెక్కడం వల్ల చల్లగాలిలోని తేమ ఆవిరై.. గాలులు వేడెక్కి.. తేలికగా మారి పైకి చేరుతాయి. గాల్లో ఉండే నీటి ఆవిరి కూడా పైకి చేరి ఘనీభవించి మంచు స్పటికాలుగా మారుతుంది. ఆపై దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. ఎక్కువ మొత్తంలో గాలులు పైకి చేరడం వల్ల కింద ఖాళీ ఏర్పడుతుంది. దాన్నే అల్పపీడనం అంటారు. అంటే గాలులు తక్కువ ఉన్న ప్రదేశం అని అర్థం. ఈ క్రమంలో చుట్టూ ఉన్న గాలులు అల్పపీడనం వైపు వీస్తాయి. ఆ వీచే గాలులతో పాటు మేఘాలు కూడా పయనించి..చల్లబడి వర్షాలుగా కురుస్తాయి. ఆ గాలుల మొత్తం ఇంకా ఎక్కువ ఉంటే.. అల్పపీడనం ఉన్నచోట గాలులన్నీ కలిసి ఒక వలయాకారంలో తిరుగుతూ ఉంటాయి. పైన ఉన్న మేఘాల నుంచి వర్షాలు కూడా కురుస్తాయి. మొత్తంగా అల్పపీడనం మరింత తీవ్రమైతే వాయుగుండంగా మారుతుంది. అది మరింత బలపడితే తుఫాన్‌గా వృద్ది చెందుతుంది.

సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని… తుఫాన్లు సంగ్రహిస్తాయి. సముద్రంలో ఏర్పడే సుడుల వల్ల చల్లబడి… దట్టమైన మేఘాలుగా ఏర్పడి తుఫాన్‌తో కలిసి ట్రావెల్ చేస్తాయి. సముద్రంలో సుడులు రూపంలో ఉండే తుఫాన్.. భూ వాతావరణంలోకి ఎంటరవ్వడాన్నే తీరాన్ని తాకడం అంటారు. తుఫాన్ భూ ఉపరితలాని తాకగానే సుడులు రూపంలో ఉన్న మేఘాలు విచ్చిన్నమై భారీ వర్షాలు కురుస్తాయి. సుడులకు కారణమైన గాలులు తీరం పైకి గంటకు 61 నుంచి 250 కిలోమీటర్ల కంటే వేగంతో ప్రయాణిస్తాయి.దక్షిణ భారతదేశంలోని తూర్పు తీరం వరుస తుఫాన్లతో తల్లడిల్లుతూ ఉంటుంది.

ఇక ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌, బంగ్లాదేశ్ వరకు అట్టుడికించే తుఫాన్లు పుట్టేది తమిళనాడు సమీపంలోని అండమాన్ పరిసరాల్లోనే… అందుకు కారణం అక్కడి వాతావరణంలో ఉన్న పరిస్థితులే కారణం అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.. ఇందుకు భౌగోళిక పరిస్థితులే కారణం.. సాధారణంగా భారతదేశానికి నైరుతి రుతుపవనాలతో ఎక్కువ వర్షపాతం ఉంటుంది. రుతుపవనాలు పశ్చిమ కనుమల వల్ల నైరుతి రుతుపవనాలు తమిళనాడు తూర్పు తీరానికి విస్తరించలేవు.

దేశం మొత్తం వర్షాలు కురిసే సమయంలో తమిళనాడు తూర్పు తీరంలో మాత్రం వాతావరణం బిన్నంగా ఉంటుంది. నైరుతి రుతుపవనాలు నిష్క్రమణతో దేశంలో కొనసాగే ఇంట్రా ట్రోపికల్ కన్వర్జెన్సీ జోన్ దక్షిణాది వైపు వచ్చేస్తుంది దీంతో బంగాళాఖాతంలోని ఉత్తర ప్రాంతంలో వాతావరణం పొడిగా మారుతుంది దీనికి తోడు ఈశాన్య రుతుపవనాలు బంగాళాఖాతం మీదుగా పయనించేటప్పుడు ఉత్తర ప్రాంతంలో జలాలు చల్లగా మారుతాయి ఇంకా భూభ్రమణ దిశను అనుసరించి భూమధ్యరేఖకు ఐదు డిగ్రీల అక్షాంశం పైన అంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు బలపడి వాయువ్యంగా ప్రయాణించి ఏపీ కోస్తా తమిళనాడు తీరం దిశగా వస్తుంటాయి. ఇంకా ఈ సీజన్లో సముద్రంలో ఏర్పడే మేఘాల్లో కలిగే చర్యల వల్ల ఈ తుఫాన్లకు కారణమైన అల్పపీడనాలు ఏర్పడతాయి.. ఆత ర్వాత వాయుగుండాలుగా, తుఫాన్లుగా బలపడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అందుకే సుదీర్ఘంగా ఉన్న బంగాళాఖాతంలో ఆగ్నేయంగా ఉన్న తమిళనాడుకు సమీపంలోని అండమాన్ సమీపంలోనే ఈ అల్పపీడనాలు ఏర్పడటానికి కారణం.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు