హైదరాబాద్‌లోని పాతబస్తీ మూసీ పరివాహక ప్రాంతంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పర్యటించారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇష్టంగా కట్టుకున్న ఖరీదైన ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం తన బాధ్యతలు మర్చిపోవడం వల్లే పేద ప్రజలు మూసీలో ఇళ్లు కట్టుకోవాల్సి వచ్చిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ మూసీ పరివాహక ప్రాంతంలో ఆయన పర్యటించి బాధితులతో మాట్లాడారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు.
ఖరీదైన ఇళ్లు వదిలేసి డబుల్ బెడ్ రూం ఇళ్లలోకి వెళ్లమంటే ఎలా వెళ్తారు? ఎక్కడికి వెళ్తారని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇష్టంగా కట్టుకున్న ఖరీదైన ఇళ్లను కూల్చివేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. తాము ఏనాడు ప్రభుత్వాలకు తలొగ్గలేదు అని, కానీ, పేదవాడి గూడు కూలుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. రూ.70 లక్షల ఇంటికి రూ.15 లక్షల ఇళ్లు ఇస్తే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. అన్ని పార్టీలు మూసీపై రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలు తమకు వ్యాపారాలు ఉన్నచోటే ఇళ్లు కట్టుకున్నారని.. ఇప్పుడు ఉన్నపళంగా కూల్చివేస్తే ఎక్కడికి వెళ్లి వ్యాపారాలు చేస్తారని నిలదీశారు. మూసీ బాధితులు ఎవరూ భయాందోళన చెందాల్సిన పనిలేదని.. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.