ఇందులో భాగంగానే తాజాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి కీలక వివరాలను వెల్లడించారు. కొత్త కార్డుల కోసం అక్టోబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు తెలిపారు. రేషన్‌కార్డుల జారీకి విధివిధానాలపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనర్సింహలతో కలిసి ఆయన గురువారం సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ వివరాలను…
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ప్రజా పాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకోగా తాజాగా మరోసారి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కొత్తగా పెళ్లిలు అయిన వారు, వేరు కుటుంబాలు ఏర్పాటు చేసిన వారు, ఇలా అర్హులై రేషన్ కార్డు లేని చాలా మందికి కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
ఇందులో భాగంగానే తాజాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి కీలక వివరాలను వెల్లడించారు. కొత్త కార్డుల కోసం అక్టోబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు తెలిపారు. రేషన్‌కార్డుల జారీకి విధివిధానాలపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనర్సింహలతో కలిసి ఆయన గురువారం సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. రేషన్ కార్డుల జారీకి పటిష్ఠ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు.
అర్హులైన వారందరికీ డిజిటల్ రేషన్‌కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రేషన్‌కార్డుల విధివిధానాలు, డిజిటల్ కార్డుల విషయమై మరోసారి సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రేషన్ కార్డులకు సంబంధించి అర్హుల ఎంపిక, హెల్త్ కార్డుల జారీ వంటి అన్ని అంశాలపై చర్చించనున్నారు. ఇక ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డును ప్రామాణికంగా మార్చడంతో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు.
స్కిల్ వర్సిటీ కోసం 150 ఎకరాలు, రూ. 100 కోట్లు..
ఇదిలా ఉంటే రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా సీఎం రేవంత్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ‘తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు’తో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ కీలక విషయాలను తెలిపారు. ‘తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం పిలుపునిచ్చారు.
ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున వర్సిటీకి 150 ఎకరాల స్థలం, రూ. 100 కోట్లు కేటియించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. నిర్వహణకు అవసరమయ్యే కార్పస్ ఫండ్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. కాగా యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రను నియమించిన విషయం తెలిసిందే.