ఈ వారం చివరి నుండి వచ్చే వారం ప్రారంభం వరకు సుదీర్ఘ సెలవులు ఉన్నాయి. దీంతో ఉద్యోగులతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పండగే. ఈ సుదీర్ఘ వారాంతంలో ప్రజలు తమ అసంపూర్తి పనులను పూర్తి చేయడానికి సిద్ధం కావచ్చు. వారంలో వరుస సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నాలుగు రోజులు, మరి కొన్ని రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. అయితే ఈనెల 17వ తేదీన సెలవు రోజుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు మిలాద్ ఉన్ నబీ, గణేష్ నిమజ్జనం తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ నెల 14వ తేదీ రెండో శనివారం కావడం వల్ల స్కూళ్లకు సెలవు ఉంది. 15వ తేదీ ఆదివారం కావడం వల్ల వరుసగా 2 రోజులు సెలవులు. అలాగే.. 16న మిలాద్ ఉన్ నబీ కాబట్టి.. ఆ రోజు సెలవు ఉంటుందనీ, 17న వినాయక నిమజ్జనోత్సవం కారణంగా ఆ రోజు కూడా సెలవు ఉండటం వల్ల వరుసగా 4 రోజులు సెలవులు వస్తాయని విద్యార్థులు భావించారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును రద్దు చేసింది. ఈనెల 14, 15వ తేదీల్లో సెలవులు అలాగే ఉన్నాయి. 16న మిలాద్ ఉన్ నబీ (మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు) పండుగ తేదీ మారింది. నెలవంక దర్శనాన్ని బట్టీ.. ఈ పండుగను 16న కాకుండా.. 17న జరుపుకోనున్నారు. దాంతో.. ప్రభుత్వం కూడా.. 16వ తేదీన సెలవును రద్దు చేసి.. 17వ తేదీన ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నెలవంక 16న కపించినట్లయితే అదే రోజు సెలవు ఉండనుంది. దీంతో వరుస సెలవులు ఉండనున్నాయి.
సెప్టెంబర్ నెల హాలిడేస్ లిస్ట్
సెప్టెంబర్ 14 రెండో శనివారం
సెప్టెంబర్ 15 ఆదివారం సెలవు
సెప్టెంబర్ 17 మీలాద్ ఉన్ నబి పబ్లిక్ హాలిడే
సెప్టెంబర్ 22 ఆదివారం అందరికీ సెలవు
సెప్టెంబర్ 28 నాలుగో శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు
సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం అందరికీ సెలవు