జలవిలయంతో విజయవాడ గజగజ వణికిపోయింది. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.విజయవాడలో ఎక్కడ చూసినా వరద నీరే కన్పిస్తోంది. చుట్టూ వరద నీరు ఉండడంతో ఇంకా వందలాది మంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. భారీవర్షాలతో విజయవాడ రూపురేఖలు మారిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లలో సహాయక చర్యలు చేపట్టారు. ఆహారం , నిత్యావసర వస్తువుల కోసం ఆ బోట్ల దగ్గరకు వందలాదిమంది జనం చేరుకుంటున్నారు. కాగా విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. తాజాగా ఆయన కృష్ణలంక ప్రాంతంలో JCBలోనూ ప్రయాణించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయన వెంట మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి ఉమా కూడా JCBలో ఉన్నారు. కారులో వెళ్లి వరద ముంపు బాధితులను పరామర్శించే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు నాయుడు ఇలా.. జేసీబీలో వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు వరద ముంపు ప్రాంతాల్లోనే గడుపుతున్నారు.
జేసీబీపై సీఎం చంద్రబాబు.. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన
Please follow and like us: