నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..

నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..

ఎగువన కురుస్తున్న వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో సాగర్ నిండుతోంది. 24 గంటల్లో 30 టీఎంసీల వరద సాగర్‌లోకి వచ్చి చేరింది. వరద ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో సాగర్‌ ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఈ క్రమంలో త్వరలోనే సాగర్ గేట్లు ఎత్తే ఆలోచనలో ఉన్నారు అధికారులు.

ఎగువన కురుస్తున్న వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో సాగర్ నిండుతోంది. 24 గంటల్లో 30 టీఎంసీల వరద సాగర్‌లోకి వచ్చి చేరింది. వరద ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో సాగర్‌ ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఈ క్రమంలో త్వరలోనే సాగర్ గేట్లు ఎత్తే ఆలోచనలో ఉన్నారు అధికారులు. సాగర్‌కు ఇన్‌ఫ్లో 5,26,501 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 34,088 క్యూసెక్కులు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం సాగర్‌కు 565 అడుగుల నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 244 టీఎంసీలు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు