‘పది లక్షలు ఇస్తే ఏకంగా రూ. 44 లక్షలు ఇస్తారు’.. నమ్మారో ఇక నిండా మునిగినట్టే..

‘పది లక్షలు ఇస్తే ఏకంగా రూ. 44 లక్షలు ఇస్తారు’.. నమ్మారో ఇక నిండా మునిగినట్టే..

అన్‌నోన్ నెంబర్‌తో కాల్ చేసి అధిక డబ్బు ఇస్తామంటే ఆశపడేరు. ఫేక్‌ ముఠా మాయలో పడ్డారంటే దారుణంగా మోసపోయినట్లే. ఏలూరు జిల్లాలో అధిక డబ్బుకు ఆశపడి ఓ వ్యక్తి నిట్టనిలువునా మోసపోయాడు.

ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీని ముఠా గుట్టురట్టైంది. పది లక్షలు ఇస్తే 44 లక్షల రూపాయలు ఇస్తామంటూ ఏలూరుకు చెందిన ఓ వ్యక్తిని బురిడి కొట్టించారు. అడ్వాన్స్‌గా అతని వద్దనుంచి 3లక్షల రూపాయాలు కాజేశారు. ఏలూరుకి చెందిన ఫణికుమార్ 108లో టెక్నీషియన్‌గా వర్క్‌ చేస్తున్నాడు. ఫణికుమార్‌ ఫోన్‌కి10లక్షలు ఇస్తే మీకు 44లక్షలు ఇస్తానని ఆశచూపించడంతో… తన దగ్గర అంత డబ్బులేవని చెప్పాడు. గత నెల 30న అడ్వాన్స్‌గా మూడు లక్షలు చెల్లించాడు. మిగతా అమౌంట్ చెల్లించగానే 44 లక్షలు అందిస్తామని ముఠా చెప్పింది. దీంతో మోసపోతున్నానని గమనించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ కరెన్సీ ముఠా ఆట కట్టించారు. కొత్త బస్టాండ్ సమీపంలో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 47 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు