GHMC పరిధి పెంపు.. 7 మున్సిపాలిటీలు, 20 కార్పొరేషన్లు విలీనం.. అసెంబ్లీలో చర్చ

GHMC పరిధి పెంపు.. 7 మున్సిపాలిటీలు, 20 కార్పొరేషన్లు విలీనం.. అసెంబ్లీలో చర్చ

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధి త్వరలో పెరగనుంది. కొత్తగా ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలో కలిపేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి రేపు (ఆగస్టు 2) అసెంబ్లీ

హైదరాబాద్ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. అందుకు అసరమైన కీలక చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌తో పాటు కొత్తగా రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద నాలుగో సిటీని నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఇక హైదరాబాద్ నగర విస్తరణపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌ (GHMC)లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం పెట్టి చర్చించనున్నారు.

నగర శివారులోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను, 33 గ్రామ పంచాయితీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పురపాలక శాఖ, జీహెచ్‌ఎంసీల అధికారులతో నాలుగు నెలల క్రితమే సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగు రోడ్డు లోపలున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలంటూ అప్పట్లోనే ఆదేశించారు. అయితే లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో ఆ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. తాజాగా.. అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో ఈ ప్రాంతాలకు మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం అరకొర నిధులతో సతమతమవుతున్న కార్పొరేషన్ల అభివృద్ధికి నిధులు దండిగా రానున్నాయి.

విలీన ప్రతిపాదనలు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు
బడంగ్ పేట్ (రంగారెడ్డి జిల్లా)
బండ్లగూడ (రంగారెడ్డి)
మీర్‌పేట్- జిల్లెల గూడ (రంగారెడ్డి)
బోడుప్పల్ ( మేడ్చల్ మల్కాజిగిరి)
ఫిర్జాదిగూడ ( మేడ్చల్ మల్కాజిగిరి)
జవహర్‌నగర్ ( మేడ్చల్ మల్కాజిగిరి)
నిజాంపేట్ ( మేడ్చల్ మల్కాజిగిరి)

విలీనంకానున్న మున్సిపాలిటీలు
రంగారెడ్డి జిల్లా పరిధిలో: పెద్దఅంబర్ పేట, ఇబ్రహీంపట్నం, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ
సంగారెడ్డి జిల్లా పరిధిలో: బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్
మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో: దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, దుండిగల్, పోచారం

Please follow and like us:
తెలంగాణ వార్తలు