మహానంది క్షేత్రంలో మద్యం సేవించి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గరు ఏజెన్సీ ఉద్యోగులతో పాటు లడ్డు కౌంటర్లో అవకతవకలు జరగడంపై ఇద్దరు రెగ్యులర్ ఎంప్లాయిస్పై సస్పెన్షన్ వేటు పడింది. ఆలయ తనిఖీల్లో భాగంగా ఈఓ శ్రీనివాస రెడ్డి తనిఖీ చేస్తూండగా లడ్డు కౌంటర్ క్యూ లైన్లలో విధులు నిర్వహించాల్సిన ముగ్గురు ఏజెన్సీ ఉద్యోగులు లేకపోవడంతో విచారణ చేపట్టారు. ఉద్యోగులు చింతల్, ప్రహాల్లద్, మహేష్ ముగ్గరు మద్యం సేవించి విధులకు డుమ్మ కొట్టినట్లు విచారణలో తేలింది. దీంతో ముగ్గురిని అప్పటికప్పుడే విధుల నుంచి ఈఓ శ్రీనివాస రెడ్డి తొలగించారు.
అదే విధంగా లడ్డు కౌంటర్లో తనిఖీ చెయ్యగా దాదాపు నాలుగు వేలు నగదు తక్కవగా ఉండటంతో పాటు లడ్డుల లెక్కల్లో కూడా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. లడ్డు కౌంటర్ అవకతవకల బాధ్యులను చేస్తూ రెగ్యులర్ ఉద్యోగులైన రికార్డు అసిస్టెంట్ మహేశ్వరి, అటెండర్ కర్ణను సస్పెండ్ చేస్తూ ఈఓ శ్రీనివాస రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పవిత్రమైన ఆలయంలో ఎంతో భక్తిశ్రద్ధలతో విధులు నిర్వహించాల్సిన ఏజెన్సీ ఉద్యోగులు ఇలా మద్యం సేవించి విధులకు హాజరు అవుతున్నారు అని తెలియడం హిందు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు.